Unstoppable With NBK Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటి సారి ఒక టాక్ షో లో పాల్గొనబోతున్న సంగతి అందరికీ తెలిసిందే..ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ చివరి ఎపిసోడ్ షూటింగ్ కాసేపటి క్రితమే హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో మొదలైంది..అభిమానులు ఈ షో కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు..పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు వేలాది సంఖ్యలో తెల్లవారు జామునే అన్నపూర్ణ స్టూడియోస్ కి చేరుకున్నారు..తమ అభిమాన హీరో కోసం పడిగాపులు కాసారు.

ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కారు ‘అన్ స్టాపబుల్’ షో సెట్స్ వైపు రావడం జరిగిందో..ఆ ప్రాంతం మొత్తం ‘సీఎం పవర్ స్టార్’ నినాదాలతో హోరెత్తిపోయింది..సెక్యూర్టీటీ అభిమానులను కంట్రోల్ చేయలేకపోయారు..అన్ స్టాపబుల్ షో కి ఇదివరకు చాలా మంది సెలబ్రిటీస్ వచ్చారు కానీ..ఈ రేంజ్ క్రేజ్ మరియు యుఫొరియా మాత్రం ఎవరికీ చూడలేదు..అందుకే క్రేజ్ మరియు ఫాలోయింగ్ లో టాలీవుడ్ పవర్ స్టార్ తర్వాతే ఎవరైనా అని అంటుంటారు అభిమానులు.
ఇక పవన్ కళ్యాణ్ ని బాలయ్య బాబు రిసీవ్ చేసుకున్న తీరు అద్భుతం..అంత పెద్ద స్టార్ హీరో అయ్యుండి కూడా ఆయన పవన్ కళ్యాణ్ కోసం బయటే నిల్చొని, ఆయన రాగానే కార్ దగ్గర కౌగలించుకొని సగౌరవంగా లోపలకు తీసుకెళ్లారు..ఇలాంటి అరుదైన సంఘటనలు అభిమానులకు తెలియకుండానే కళ్ళలో నుండి నీళ్లు రప్పించేలా చేస్తాయి.

ఇక ఈ షో కి పవన్ కళ్యాణ్ తో పాటుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు డైరెక్టర్ క్రిష్ కూడా హాజరయ్యారు..ఆ తర్వాత షో మధ్యలో ఒక ఫోన్ కాల్ ఉంటుందట..ఆ ఫోన్ కాల్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి తో ఉంటుంది అనుకున్నారు, కానీ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో ఉంటుందట..అలా ఆద్యంతం వినోదభరితంగా సాగిపోనున్న ఈ ఎపిసోడ్ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్నారు..సంక్రాంతి కానుకగా ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కాబోతుందని తెలుస్తుంది.
JAI POWERSTAR🔥🔥🔥🔥🔥#NBKwithPawanKalyan#PawanKalyanOnAHA pic.twitter.com/AgMc9BML5L
— ustaad #OG (@CultFanIkkada) December 27, 2022