Balakrishna : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలలో బాలకృష్ణ ఒకరు. ఈయన తీసిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాడు. సీనియర్ హీరో అయినప్పటికీ కుర్ర హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అయితే బాలయ్య బాబు అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్నారు.ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవత్ కేసరి అనే సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అవుతుంది. అందులో భాగంగానే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని కూడా చిత్ర యూనిట్ మొదలుపెట్టింది. ఇక అందులో భాగంగా ఒక ప్రమోషన్ లో పాల్గొన్న సినిమా టీం ఆ సినిమా గురించి మాట్లాడుతూ దర్శకుడు అనిల్ రావిపూడి అభిమానులు పెట్టుకున్న అంచనాలన్నింటిని ఈ సినిమా రీచ్ అవుతుంది అంటూ చెప్పాడు. ఇక ఈ క్రమంలోనే బాలయ్య బాబు మాట్లాడుతున్న సందర్భంలో తన విగ్గు గురించి ఒక ప్రస్తావన రావడం జరిగింది. సినిమా షూటింగ్ టైంలో లొకేషన్ లోనే షాట్ కు షాట్ కి మధ్యనున్న గ్యాప్ లో బాలయ్య చాప వేసుకుని కింద పడుకునేవాడని దాంట్లో భాగంగానే ఆయన విగ్గు తీసి పడుకునే వాడని చెప్పాడు. ఆయన విగ్గు తీసినప్పుడు చూసిన ఒక వెదవ మీరు విగ్గు వాడతారా అనడంతో నీ గడ్డానికి వెంట్రుకలు ఇక్కడ నుంచి పీక్కొని పెట్టుకున్నావు అంటూ సమాధానం ఇచ్చానని బాలయ్య బాబు తెలియజేశాడు.ఇప్పుడు ఆ విషయం చెబుతూనే మన దగ్గర దాపరికాలు ఉండవు ఏది అయిన ఓపెన్ బుక్ లాగే ఉంటుంది అంటూ ఇలా ఓపెన్ గా ఆ విషయం గురించి చెప్పడం జరిగింది…
ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న బాలయ్య బాబు అభిమానులు బాలయ్య బాబు వాళ్ళకి ఇచ్చిన కౌంటర్ పట్ల చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.బాలయ్య బాబు లోపల ఒకటి పెట్టుకొని బయటికి మరొకటి మాట్లాడే రకం కాదు. ఏదైనా ఫేస్ టు ఫేస్ అనేస్తాడు అందుకే ఆయన బాలయ్య బాబు అయ్యారు అంటూ ఆయన అభిమానులు ఇప్పటికే ఆయన చెప్పిన మాటలు మీద భారీ ఎత్తున బాలయ్యా బాబుకు సపోర్టుగా మాట్లాడుతూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.ఇక భగవంత్ కేసరి సినిమా హిట్ అయితే ఈ మధ్య కాలం లో సీనియర్ హీరోలకి ఎవరికి సాధ్యం కానీ రీతిలో బాలయ్య హ్యాట్రిక్ హిట్లు సాధిస్తారు…