Homeఎంటర్టైన్మెంట్Bala Krishna: త్వరలోనే నందమూరి బాలయ్య "రామయ్య"గా రానున్నాడా...

Bala Krishna: త్వరలోనే నందమూరి బాలయ్య “రామయ్య”గా రానున్నాడా…

Bala Krishna: తెలుగు చిత్ర పరిశ్రమలో గ‌త కొద్ది రోజులుగా జ‌రుగుతోన్న ప‌రిణామాలు చూస్తుంటే అల్లు కుటుంబం నందమూరి కుటుంబాల మధ్య సన్నిహిత సబంధాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఇంతకాలం అక్కినేని, మెగా ఫ్యామిలీ సన్నిహితంగా మెలుగుతుందనే భావన చాలామందిలో ఉంది. అలానే అల్లు అరవింద్ సైతం అక్కినేని నట వారసులు నాగచైతన్య, అఖిల్ తో సినిమాలు నిర్మించి ఆ కుటుంబంతో తనకున్న సాన్నిహిత్యాన్ని చాటుకున్నారు. పైగా చిరంజీవి, అల్లు అరవింద్, నాగార్జున ఓ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ లో భాగస్వాములు కావడం కూడా వారి బంధాన్ని మరింత బలోపేతం చేసింది. అయితే ఇప్పుడు అల్లు అరవింద్ నందమూరి ఫ్యామిలి కి క్లోజ్ అవుతున్నట్లు తెలుస్తుంది.

nandamuri bala krishna going to act under geetha arts banner

తన తండ్రి అల్లు రామలింగయ్య, మహానటుడు ఎన్టీయార్ మధ్య ఉన్న అనుబంధాన్ని ఆసరాగా తీసుకుని తన ఓటీటీ ప్లాట్ ఫామ్ ‘ఆహా’ లో బాలకృష్ణతో అన్ స్టాపబుల్ పేరుతో ఓ షో చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా అల్లు అరవింద్ తన సొంత నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ లోనూ బాలయ్య బాబుతో ఓ సినిమా ప్లాన్ చేశారని సమాచారం. ఇటీవలే ‘అఖండ’ చిత్రంతో ఘన విజయం సాధించాడు బాలయ్య. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో సినిమా వచ్చే రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. ప్రస్తుతం బాలకృష్ణ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మలినేని గోపీచంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత బాలకృష్ణ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ సినిమా నిర్మిస్తారని, దానికి సంపత్ నంది దర్శకత్వం వహిస్తారని టాక్ నడుస్తుంది. ఈ చిత్రానికి ‘రానే వస్తాడు రామయ్య’ అనే టైటిల్ పెట్టే ఆలోచనలో కూడా ఉన్నారట. మరి ఈ వార్తా నిజమో కాదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.

 

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular