Samantha- Nagarjuna: స్టార్ హీరోయిన్ సమంతకు మయోసిటీస్ వ్యాధిపై సినీ ఇండస్ట్రీ ఆవేదన చెందుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. ఇందులో భాగంగా అక్కినేని ప్యామిలీ కూడా సమంతకు వ్యాధి నయం కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మొదట్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ఎందరో సమంత వ్యాధిపై స్పందించారు. కానీ అక్కినేని ఫ్యామిలీ రెస్పాండ్ కాలేదు. కానీ ఆ తరువాత అక్కినేని అఖిల్ సమంత గురించి ఇన్ స్ట్రాగ్రాంలో పోస్టు పెట్టడం అందరినీ ఆలోచింపచేసింది. ఆ తరువాత నాగచైతన్య సమంతను నేరుగా కలిశాడని అంటున్నారు. కానీ అందుకు సంబంధించి ఫొటోలు గానీ.. వీడియోలు గానీ.. బయటకు రాలేదు. అయితే లెటేస్టుగా సమంత మాజీ మామ, సీనియర్ హీరో అక్కినేని నాగార్జున ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు.

సమంతకు మయోసిటీస్ వ్యాధి గురించి తెలియగానే సినీ ప్రముఖులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఇక మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టి ఆకట్టుకున్నాడు. ‘వ్యాధి తీవ్రత కంటే మానసికంగా ధైర్యంగా ఉండాలి’ అని చెప్పడంతో మెగాఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. అటు సమంత కూడా చిరంజీవి థ్యాంక్యూ చెప్పింది. ఈ క్రమంలో అక్కినేని నాగార్జున సమంతను నేరుగా కలిశాడని అన్నారు. కానీ అవన్నీ పుకార్లే అని తేలాయి. కానీ లేటేస్టుగా నాగార్జున సమంత కోసం ఓ మోటివేషన్ పోస్టు పెట్టారు. అదిప్పుడు వైరల్ గా మారింది.
‘డబ్బులు శాశ్వతం కాదు.. మనుషులే శాశ్వతం.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’ అని పోస్టు పెట్టారని అంటున్నారు. కానీ నాగార్జున ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సమంత, నాగార్జున మధ్య సాన్నిహిత్యం ఎంతో ఉంది. ఆమె నాగచైతన్యను వివాహం చేసుకుంటానని చెప్పగానే ముందుగా సంతోషించింది నాగార్జుననే. అంతేకాకుండా వీరిద్దరు కలిసి మనం సినిమాలో చేసిన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అటు సమంత తాను కోలుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపింది. ప్రస్తుతం సమంత ‘యశోధ’ సినిమాతో బిజీగా మారింది. ఆ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇటీవలే రిలీజైంది. ఇందులో సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రలో నటించింది. వీటితో పాటు విజయ్ దేవరకొండతో ‘ఖుషి’ అనే సినిమాలో నటిస్తోంది. అటు బాలీవుడ్లోనూ ఈ భామ ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఈ క్రమంలో అమె త్వరలో షూటింగ్ స్పాట్ కు వస్తుందని అందరూ ఆశిస్తున్నారు.