
The Ghost Movie 1st Look: విలక్షణమైన సైంటిఫిక్, రీసెర్చ్ చిత్రాలు తీయడంలో దర్శకుడు ప్రవీణ్ సత్తారుది అందెవేసిన చేయి. అతడు హీరో రాజశేఖర్ తో తీసిన ‘గరుడ వేగ’ ఒక హైలెట్ అని చెప్పొచ్చు. సరికొత్త కథాంశాలతో ప్రవీణ్ సత్తారు సినిమాలు తీస్తుంటాడు. ఈ కోవలోనే టాలీవుడ్ అగ్రహీరో కింగ్ నాగార్జున తో కలిసి తాజాగా సినిమా అనౌన్స్ చేశాడు.
నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ఘోస్ట్’ అనే సినిమాను ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూడడానికి చాలా బాగుంది. లండన్ లోని ప్రఖ్యాత బిగ్ బెన్ వద్ద వర్షపు రాత్రి చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. దాని ముందుర నాగార్జున చేతిలో ఒక కత్తి పట్టుకొని విదేశీయులంతా మోకరిల్లేలా ఉన్న పోస్టర్ అదిరిపోయేలా ఉంది. భయానక వాతావరణంలో ఈ దెయ్యం కథ ఏంటనేది ఆసక్తి రేపేలా ఉంది.
ఉరుములు, మెరుపుల మధ్య నాగార్జున అలా కత్తి పట్టుకొని నిలుచుకున్న పోస్టర్ భయపెట్టేలాగే ఉంది. ఇందులో అతడి ప్రత్యర్థులంతా మోకరిల్లి ఓటమిని అంగీకరించినట్టుగా పోస్టర్ ను డిజైన్ చేశారు.
యాక్షన్ సినిమా ప్రియుల కోసం చూడాల్సిన చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కథ ఏంటనేది మాత్రం తెలియరాలేదు. ఘోస్ట్ అని పెట్టడంతో ఇదొక దెయ్యం కథనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. గతంలో ఎన్నడూ చూడని పాత్రలో నాగార్జునను ఇందులో చూపించడానికి దర్శకుడు ఒక ప్రత్యేకమైన పాయింట్ తో శక్తివంతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది.
పోస్టర్ లో ప్రవీణ్ సత్తారు మార్క్ స్టైలిష్ మేకింగ్ లుక్ కనిపిస్తోంది. పొడవైన కోటుతో నాగార్జున కఠువుగా కనిపిస్తున్నారు. ముఖేష్ జీ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. నార్త్ స్టార్, ఎస్వీసీఎల్ఎల్ పీ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఇప్పటికే నాగార్జున ఈ సినిమా కోసం పలు యాక్షన్ సన్నివేశాల్లో నటించినట్టు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్లోనే షూటింగ్ శరవేగంగా సాగుతోంది.