Bigg Boss Telugu Season 6: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను రియాల్టీ షో బిగ్ బాస్ ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు ఐదు సీజన్లు ప్రసారమవగా… అన్ని సీజన్లు టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోయాయి. ఇప్పుడు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6కు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటికే విడుదలైన ప్రోమోలు, కొత్త లోగో బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా క్రికెట్ ను మరిపించేలా బిగ్ బాస్ 6 సీజన్ ప్రోమోను వదిలారు. ‘కొందరు గల్లీలో క్రికెట్ ఆడుతూ ఉంటారు. బ్యాటర్ రెడీగా ఉంటే.. బౌలర్ బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతూ గంట కొట్టగానే అలా పరుగెత్తుకుంటూ ఇంట్లోకెళ్లిపోతాడు. వీడికేమైంది అనుకుంటూ బ్యాటర్ షాక్‌తో ఇటు చూసే సరికి అక్కడ ఎవరూ కనిపించరు.

అంతలో హీరో నాగార్జున స్టైలిష్ ఎంట్రీ ఇస్తూ.. ‘అలా ఎర్రి మొహమేసుకొని సూత్తావేంటిరా ?’ అంటూ స్క్రీన్ పైకి వచ్చాడు. ‘ఇక్కడ ఆట ఆగిందంటే.. అక్కడ అసలు ఆట మొదలైనట్లే అంటూ బిగ్‌బాస్ షోను అనౌన్స్ చేశాడు. లైఫ్‌లో ఏ మూమెంట్ అయినా బిగ్‌బాస్ తర్వాతే అంటూ నాగ్ తనదైన స్టైల్లో చెప్పిన డైలాగ్ బాగుంది. ఇక ఈ సీజన్ 6 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ చాలా కాలంగా వెయిట్ చేస్తున్నారు. వారికి క్లారిటీ ఇస్తూ సెప్టెంబర్ 4 నుంచి ఈ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇందులో కంటెస్టెంట్లు ఎవరు అన్నదానిపై ఉత్కంఠ వీడలేదు. మరోవైపు… బిగ్ బాస్ కంటెస్టెంట్లు వీరేనంటూ ఒక జాబితా కూడా వైరల్ అవుతోంది.
Also Read: Somy Ali: ఆ స్టార్ హీరో నీచుడు, అమ్మాయిల రక్తం తాగుతాడు.. సంచలన నిజాలు చెప్పిన హీరోయిన్

ఈ సీజన్‌లో మొత్తం 17 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతున్నారు. పైగా ఎంపికైన కంటెస్టెంట్స్ ని అన్నపూర్ణ స్టూడియోస్ లోనే క్వారంటైన్ కి పంపారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో వేసిన బిగ్ బాస్ గ్రాండ్ సెట్ లో వారిని సెప్టెంబర్ 4 వరకు అక్కడే ఉంచుతారు. ఇక కంటెస్టెంట్స్ వీరే అంటూ వారి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. చూద్దాం వారెవరో అనేది.
1. అజయ్ కుమార్
2. మిత్రా శర్మ
3. ఉదయభాను
4. ఆర్జే చైతూ
5. అనిల్ రాథోడ్
6. దీపిక పిల్లి
7. అమర్ దీప్ చౌదరీ
8. శ్రీహాన్
9 నేహా చౌదరీ
10. ఆర్జే సూర్య
11. ఆది రెడ్డి
12. నిఖిల్ విజేంద్ర
13. చలాకీ చంటీ
15. శ్రీ సత్య
16. ఇనయా సుల్తానా
17. పాండు మాస్టర్
[…] […]