సీనియర్ రొమాంటిక్ హీరో అక్కినేని నాగార్జున సూపర్ హిట్ చిత్రాల్లో ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమా కూడా ప్రముఖంగా ముందు వరుసలో నిలుస్తోంది. 2015లో విడుదలైన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రంలో నాగార్జున చేసిన బంగార్రాజు పాత్రకు విశేషమైన స్పందన లభించింది. దీంతో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున – నాగ చైతన్య కాంబినేషన్ లో ఆ సినిమాకి సీక్వెల్ తీయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఎప్పుడో మొదలవ్వాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. దాంతో అనుకున్న సమయానికి బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు.
అయితే అక్టోబర్ మొదటి వారంలో ఈ సినిమాను మొదలుపెట్టి, సింగిల్ షెడ్యూల్ లోనే షూటింగ్ ను పూర్తి చేసి… అన్ని కుదిరితే వచ్చే సంక్రాంతికి బంగార్రాజు సినిమాని రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోందట. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో రమ్యకృష్ణ కూడా నటించబోతుంది. కాగా ప్రస్తుతం జూమ్ యాప్ లో కళ్యాణ్ కృష్ణ, ఈ చిత్ర సంగీత దర్శకుడు అనుప్ రూబెన్స్‌తో పాటు సాంగ్స్ కంపోజిషన్స్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు ట్యూన్స్ పూర్తయ్యాయట. మొత్తానికి ‘బంగార్రాజు’ రాక ఆలస్యం అయినా, ఆసక్తి ఉండేలా ఉంది.
మరి నాగ్ ఈ సారి హిట్ కొడతారా చూడలి. అయితే నాగ్ గత సినిమా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వచ్చిన `మన్మథుడు 2′ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. దాంతో బంగార్రాజు పై మరింత కేర్ తీసుకుంటున్నారు.
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Nagarjunas bangarraju to soon go on floors
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com