Homeఎంటర్టైన్మెంట్Nagarjuna wrong step: నాగ చైతన్య విషయంలో రాంగ్ స్టెప్ వేసిన నాగార్జున...ఆ ఒక్క మూవీ...

Nagarjuna wrong step: నాగ చైతన్య విషయంలో రాంగ్ స్టెప్ వేసిన నాగార్జున…ఆ ఒక్క మూవీ చేసి ఉంటే బాగుండేది…

Nagarjuna wrong step: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళ నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. నాగేశ్వరరావు దగ్గర నుంచి నాగ చైతన్య వరకు ప్రతి ఒక్కరూ తమ సత్తా చాటుకున్న వాళ్లే కావడం విశేషం. అయితే నాగార్జున తనదైన రీతిలో సక్సెస్ లను సాధిస్తూ వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ టాప్ హీరోగా ఎదిగాడు. ఇక ఈ క్రమంలోనే నాగచైతన్య జోష్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోయిన కూడా తర్వాత చేసిన ‘ఏ మాయ చేసావే’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక అప్పటినుంచి వెను తిరిగి చూడకుండా వరుస విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న నాగచైతన్య ప్రస్తుతం తన సత్తా చాటుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు…

నాగచైతన్య విషయంలో నాగార్జున చాలా వరకు రాంగ్ స్టెప్ వేశాడు అంటూ చాలామంది చెబుతూ ఉంటారు. కారణం ఏంటి అంటే నాగచైతన్య ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల నాగార్జున ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. దాంతో జోష్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ ఈ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు.

కొత్త బంగారులోకం సినిమాతో ఎంట్రీ ఇచ్చినట్టయితే నాగచైతన్యకు మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ వరించేది. అలాగే టైం వన్ హీరోగా మారడానికి కూడా తనకు పూర్తిగా అవకాశం అయితే ఉండేది… కానీ నాగచైతన్య విషయంలో నాగార్జున అక్కడే రాంగ్ స్టెప్ వేశాడు. అందువల్లే నాగచైతన్య ఇప్పటివరకు టైర్ వన్ హీరోగా మారలేకపోతున్నాడు అంటూ చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా నాగార్జున తన కొడుకులను టాప్ హీరోలుగా మార్చడంలో మాత్రం చాలా వరకు వెనుకబడిపోయాడు.

ఇక ఈ విషయాన్ని నాగార్జున సైతం కొన్ని సందర్భాల్లో ఒప్పుకోవడం విశేషం… ప్రస్తుతం నాగచైతన్య కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకొని తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version