https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: షాకింగ్… బిగ్ బాస్ ఇంటి నుండి బయటకి వచ్చిన షన్ను..!

Bigg Boss 5 Telugu: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ప్రోమో రానే వచ్చింది. గత వారం నుండి బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరి లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇద్దరి చేష్టలపై నాగార్జున ఘాటుగానే స్పందించాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది… ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించాడు నాగార్జున (Nagarjuna). సిరి కి, […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 20, 2021 / 07:13 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ బిగ్ బాస్.. ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసే బిగ్ బాస్ శనివారం ఎపిసోడ్ ప్రోమో రానే వచ్చింది. గత వారం నుండి బిగ్ బాస్ ఇంట్లో షన్ను, సిరి లు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అయితే ఈ ఇద్దరి చేష్టలపై నాగార్జున ఘాటుగానే స్పందించాడు. అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది… ఎందుకు జరుగుతుంది అని ప్రశ్నించాడు నాగార్జున (Nagarjuna). సిరి కి, షన్ను కి గట్టిగానే చురకలు అంటించాడు నాగార్జున.

    బిగ్ బాస్ హౌస్ లో పదకొండో వారంలో దారుణాతి దారుణాలు ఘోరాతి ఘోరాలు జరిగాయి. ఒక పక్క మానస్, ప్రియాంక రిలేషన్ షిప్ అర్ధం కాక జుట్టు పట్టుకుంటున్నారు జనాలు. మధ్యలో నిబ్బా నిబ్బి స్టోరీ తో ప్రజలకి చిరాకు తెప్పిస్తున్నారు షన్ను, సిరి జంట. ఎందుకు అలుగుతారో, ఎందుకు కోప్పడతారో, ఎందుకు ఏడుస్తారో, మళ్ళీ ఎందుకు కలిసిపోతారో ఎవ్వరికి అర్ధం కాదు.

    అయితే ఈ వారం షన్ను, సిరి లు కాస్త హద్దులు దాటి ప్రవర్తించారు. ఏకంగా షన్ను కి సిరి ఏకంగా లిపి కిస్ ఇచ్చి ప్రేక్షకులని నివ్వెర పోయేలా చేసింది. దీనితో ఎడిటర్లు ఈ సన్నివేశాలని బ్లర్ వేసి మరి చూపించారు. అయితే తాజాగా వీకెండ్ ఎపిసోడ్ లో సిరి, షన్నులని నాగార్జున కడిగిపారేసినట్లుగా తాజాగా విడుదల చేసిన ప్రోమో లో తెలిసిపోతుంది.

     

    Tags