‘అక్కినేని నాగార్జున’ ప్రస్తుతం సినిమాల వేగాన్ని పెంచాడు. దాంతో ఆయన హీరోగా రూపొందుతోన్న సినిమాల దర్శకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎవరి సినిమాకి నాగ్ ముందుగా డేట్లు ఇస్తాడో నాగ్ కే క్లారిటీ లేదు. అసలు ఉన్నట్టు ఉండి సడెన్ గా ప్రవీణ్ సత్తారుకి డేట్లు ఇవ్వడమే గమ్మత్తుగా జరిగింది. ఏది ఏమైనా నాగార్జున గతంలో కంటే, ఇప్పుడు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు.
నాగార్జునకి రొమాంటిక్ హీరో అనే బిరుదు ఆనవాయితీగా వస్తోంది. నిజానికి 60 ప్లస్ వయసులో కూడా నాగ్ కి ఆ బిరుదు ఉంది అంటే.. బహుశా ఇది ఒక్క నాగ్ కి మాత్రమే సాధ్యం అయిందనుకుంటా. అయినా ఇప్పటికీ నాగ్ సూపర్ బాడీని మైంటైన్ చేస్తున్నాడు. అరవై దాటినా నాగ్ లో వయసు మళ్ళిన ఛాయలు పెద్దగా కనిపించవు. కాకపోతే నాగ్ అభిమానుల అభిరుచులు మారాయి.
వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. నాగ్ కి ఎక్కువగా లేడీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఆ లేడీస్ అందరూ అమ్మమ్మలు అయిపోయారు. వాళ్ళు ఈ వయసులో రొమాంటిక్ కథలు ఏమి చూస్తారు. అందుకే మన్మధుడు 2 అంటూ నాగార్జున అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ సినిమా చేస్తే, బాక్సాఫీస్ వద్ద ఆ సినిమాని దారుణంగా నిర్ధాక్ష్యంగా రిజెక్ట్ చేశారు నాగార్జున అభిమానులు.
అందుకే నాగార్జున తన శైలికి భిన్నంగా ‘వైల్డ్ డాగ్’ అంటూ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమా చేశాడు. కానీ ఆ సినిమా కూడా థియేటర్లలో ఆడకపోగా నాగ్ కి నష్టాలను మిగిల్చింది. దాంతో నాగార్జున కన్ ఫ్యూజన్ లోకి వెళ్ళిపోయారు. రొమాన్స్ డోస్ తో సాగే రెగ్యులర్ సినిమాలు చేయలేడు, అలా అని యాక్షన్ డోస్ పెంచుతూ సినిమాలు చేయలేడు.
ఆ కన్ ఫ్యూజన్ తోనే నాగార్జున తనతో సినిమాలు తీస్తున్న దర్శకులను బాగా కష్ట పెడుతున్నాడు. వాళ్ళు ఏది చెప్పినా ఏవో మార్పులు చెబుతూ సినిమాని మాత్రం సెట్స్ పైకి తీసుకు వెళ్లడం లేదు. ప్రవీణ్ సత్తారుకి వెంటనే డేట్స్ ఇచ్చినా సినిమాని మాత్రం రోజురోజుకు పోస్ట్ ఫోన్ చేస్తూ వెళ్తున్నాడు. ఇక బంగార్రాజు పరిస్థితి గత నాలుగేళ్ళ నుండి అతీగతీ లేకుండా పడి ఉంది. మొత్తానికి నాగ్ తన కన్ ఫ్యూజన్ తో డైరెక్టర్లను బాగా టార్చర్ పెడుతున్నాడు.