Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది డైరెక్టర్లు వాళ్లకు అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా రకాల సినిమాలు చేస్తూ ఉంటారు.ఇక అలాంటి యంగ్ డైరెక్టర్ లలో సుధీర్ వర్మ ఒకడు. ఈయన మొదటగా నిఖిల్ హీరోగా స్వామి రారా అని సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది ఇక ఆ తర్వాత ఆయన నాగచైతన్య హీరోగా దోచేయ్ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది ఇంకా ఆ తర్వాత మళ్లీ నిఖిల్ హీరోగా కేశవ అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా అవరేజ్ గా ఆడింది. ఇక తర్వాత శర్వానంద్ హీరోగా రణరంగం అనే సినిమా చేశాడు ఈ సినిమా ప్లాప్ అయింది. దాంతో కొంచం గ్యాప్ తీసుకొని రవితేజ హీరోగా రావణాసుర అనే సినిమా చేశాడు ఈ సినిమా కూడా అనుకున్న విజయాన్ని అందించలేకపోయింది. ఇక దాంతో ఆయన ప్రస్తుతం ఒక మంచి స్టోరీ రాసుకున్నట్లుగా తెలుస్తుంది.
ఈ సినిమా స్టోరీ ఒక మాఫీయా డాన్ కి సంబంధించిన కథగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోగా నాగార్జున అయితే బాగుంటుందని సుధీర్ వర్మ అనుకొని ఇప్పటికే ఆయనకి కథ కూడా చెప్పాడట,అయితే కొత్త వాళ్లను యంగ్ డైరెక్టర్స్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేసే నాగార్జున ఈ కథ విని చాలా బాగుంది మనం ఈ సినిమా చేద్దాం అని చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమా ద్వారా సుధీర్ వర్మ ఒక మంచి హిట్ కొడితేనే తప్ప ఆయనకి మళ్లీ ఇండస్ట్రీలో ఇంకో సినిమా అనేది ఉంటుంది లేకపోతే కష్టమే అందుకే ఈ సినిమాని చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం నాగార్జున ప్రసన్నకుమార్ బెజవాడ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా వైపు వస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించి సుధీర్ వర్మ కి డైరెక్టర్ గా మంచి పేరు తీసుకురావాలని కోరుకుందాం…