Lobo and Shanmukh: ప్రేక్షకులు ఎప్పుడుప్పుడా అని ఎదురు చూసే శనివారం రానే వచ్చింది. ‘నాగ్ మామ రావాలి కంటెస్టెంట్స్ కి క్లాస్ పీకాలి’ అని అనుకునే ప్రతి ఒక్క ఆడియన్స్ కి కావాల్సిన రోజు వచ్చింది. హౌస్ లో కంట్రోల్ తప్పి, బూతులు మాట్లాడుతూ పెద్దగా అరుస్తూ బిగ్ బాస్ హౌస్ యొక్క హార్మొనీ దెబ్బ తినేలా ప్రవర్తించే కంటెస్టెంట్ల తిక్క కుదర్చడానికి వీకెండ్ ఎపిసోడ్ ద్వారా సన్నద్ధం అయ్యాడు నాగ్ మామ.

ప్రోమో లో ‘ఫుల్ ఫైర్ మీద’ ఉన్ననాగార్జున…. షణ్ముఖ్, సిరి, లోబోలా మీద పెద్ద పెద్ద గా అరుస్తూ క్లాస్ లు పీకుతూ లెక్కలు తేలుస్తున్నాడు. మొదట షణ్ముఖ్ ని మిర్చి తినమంటూ … గేమ్ ఆడకుండా కబుర్లు చెప్తున్నావేంటయ్యా అంటూ… సిరి తో మాట్లాడుతూ ఏమ్మా ‘సిరి’ నీ గేమ్ నువ్వు ఆడమ్మా అంటూ చురకలేస్తాడు.అంతేకాకుండా జెస్సీ మీ వల్ల సఫర్ అవుతున్నాడని షన్ను ని సిరి ని ఉద్దేశించి చెప్పాడు నాగ్.
ఇక లోబో విషయం చెప్పనక్కర్లేదు.. ఎందుకంటే సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో జరిగిన వ్యవహారం చూసి కచ్చితంగా శనివారం నాగార్జున చేతిలో లోబో కి క్లాస్ మూడింది అని బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ ముందుగానే భావించారు. . సోమవారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో లోబో ప్రియా మీద అరుస్తూ సింపతీ కార్డు ఉపయోగించాడు. అంతేకాకుండా విల్లా, అపార్ట్మెంట్, బస్తీ ల మధ్య వ్యత్యాసం గురించి వివరిస్తూ… తాను బస్తి నుండి వచ్చా అని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్నీ నిలదీస్తూ నాగార్జున లోబో కి క్లాస్ పీకుతాడు.
తాజా గా రిలీజ్ అయిన ప్రోమో లో మాత్రం షన్ను,సిరి, లోబోకి మాత్రం మంచి లెక్చర్ ఇచ్చాడు. ఇంకా ఎవరెవరికి ఎంతంత క్లాస్ పీకాడో, ఎవరెవరిని నామినేషన్స్ లో నుండి సేవ్ చేసాడో తెలుసుకోవాలంటే ఈ రోజు (శనివారం) జరిగే ఎపిసోడ్ ని మాత్రం కచ్చితం గా చూడాల్సిందే.