Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. నాగార్జున ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన తన వందో సినిమాని చాలా ప్రెస్టేజీయస్ గా తీసుకొని మరి చేస్తుండడం విశేషం… వీలైనంత తొందరగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకోవడం ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా లెనిన్ సినిమా సక్సెస్ అయిన సందర్భంలో ఆయన కొన్ని కామెంట్స్ చేశాడు. లెనిన్ సినిమాని జూన్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అనౌన్స్ చేసినప్పటికి అనుకున్న డేట్ కి సినిమా పూర్తి కాకపోవడంతో ఆ సినిమాని జులై 10 కి పోస్ట్ పోన్ చేశాం. నిజానికి ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత మనం ఎందుకని ఆ సినిమాను అనుకున్న డేట్ కి తీసుకురాలేకపోతున్నాం…
టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎందుకని ఎదురవుతున్నాయి. అనుకున్న సమయానికి సినిమాని పూర్తి చేయలేమా ‘ది ఒడిస్సీ’ అనే సినిమాని క్రిష్టఫర్ నోలన్ సంవత్సరం క్రితమే అనౌన్స్ చేసి పర్ఫెక్ట్ గా అనుకున్న తేదీకి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.
నిజానికి వాళ్ళకున్న కమిట్మెంట్ మనకు లేదా అంటూ నాగార్జున ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని ఉద్దేశిస్తూ చాలా ఘాటు వ్యాఖ్యలైతే చేశాడు. నిజానికి ఒక సినిమాకి రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ డేట్ కి కట్టుబడి అందరు వర్క్ చేస్తే సినిమా అనుకున్న రేంజ్ లో చాలా తొందరగా అయిపోతుంది. కానీ ఎవరు దానికి కట్టుబడి ఉండడం లేదనేది ఇండస్ట్రీ వర్గాల నుంచి కొన్ని వార్తలైతే వస్తున్నాయి…
మొదట అనుకున్న డేట్ కి రిలీజ్ కనుక చేయగలిగితే మాత్రం సినిమా మీద భారీ బజ్ ఉండడమే కాకుండా ప్రతి ఒక్కరు ఆ సినిమా మీద అటెన్షన్ ని క్రియేట్ చేస్తూ భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టే అవకాశాలు కూడా ఉంటాయి. రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అయ్యే కొద్ది సినిమా మీద హైప్ తగ్గుతుంది…నాగార్జున మాట్లాడిన మాటలను గౌరవిస్తూ ఇండస్ట్రీ లో ఉన్న అందరు అనౌన్స్ చేసిన డేట్ కి సినిమాలను రిలీజ్ చేయగలుగుతారా లేదా అనేది చూడాలి…




