Nagarjuna And Krishna: ఇండస్ట్రీ లో యువ సామ్రాట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నాగార్జున. ఆయన చేసిన శివ, గీతాంజలి లాంటి సినిమాలు ఆయనకి నటుడుగా ఒక మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇక ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు కమర్షియల్ గా ఆయన మార్కెట్ ని పెంచడానికి చాలా హెల్ప్ చేశాయి. ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన ఎలిమెంట్ ఉండేలా చూసుకొని సినిమాలు చేస్తూ ఉండేవాడు. ఇక ఇదిలా ఉంటే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున చేసిన వారసుడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
అప్పట్లో ప్లాప్ ల్లో ఉన్న నాగార్జునకి ఈ సినిమా ఒక మంచి హిట్ ను అందించింది. ఈ సినిమాలో నాగార్జునకి ఫాదర్ గా కృష్ణ నటించాడు. ఇక ఈ సినిమాలో ఒక సీన్ లో నాగార్జున, కృష్ణ ల మధ్య గొడవ జరుగుతుంది. అందులో నాగార్జున కి కోపం వచ్చి కృష్ణ గారి కాలర్ పట్టుకునే షాట్ ఒకటి ఉంది. ఇక దర్శకుడు ఇవివి సత్యనారాయణ కృష్ణ గారి కాలర్ పట్టుకోండి అని నాగార్జునతో చెప్పినప్పటికీ నాగార్జున ఆ సీన్ చేయడానికి చాలా వరకు ఇబ్బంది పడ్డాడట.
కృష్ణ గారు స్టార్ హీరో పైగా ఆయన నాగార్జున కంటే పెద్దవారు కాబట్టి కాలర్ పట్టుకోడానికి నాగార్జున చాలా వరకు తటపటయించడట. కానీ చివరికి కృష్ణ చొరవ తీసుకొని సినిమాలో ఇదంతా కామన్ నాగార్జున, దీన్ని నువ్వు ఏమి పర్సనల్ గా తీసుకోవాల్సిన పనిలేదు. అని చెప్పి తనకు మోటివ్ గా సపోర్ట్ చేయడంతో నాగార్జున కృష్ణ గారి కాలర్ పట్టుకొని డైలాగ్ చెప్పాడట. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కృష్ణ అభిమానులు నాగార్జునకి వార్నింగ్ లు కూడా ఇచ్చారట. తమ అభిమాన హీరో అయిన కృష్ణ గారి కాలర్ పట్టుకోడానికి నువ్వు పెద్ద తోపు హీరోవి ఏం కాదు అంటూ నాగార్జున మీద విపరీతమైన విమర్శలను చేశారట.
దాంతో నాగార్జున ఇవివి తో ఈ సీన్ మార్చిన అయిపోయేది ఇప్పుడు కృష్ణ గారి అభిమానులు నన్ను టార్చర్ పెడుతున్నారు అని చెప్పాడట. ఇక మొత్తానికైతే కృష్ణ గారు స్పందించి సినిమాలో ఇవన్నీ భాగమే అని చెప్పడంతో ఆయన అభిమానులు కూల్ అయ్యారు. నిజానికి అప్పట్లో కృష్ణ గారికి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. అభిమాన సంఘాలు కూడా విపరీతంగా ఉండేవి… మొత్తానికైతే ఈ సినిమా ద్వారా నాగార్జున కృష్ణ ఫ్యాన్స్ నుంచి చాలా విమర్శలను ఎదుర్కొన్నాడు…