Nagababu- Jabardasth: మెగా బ్రదర్ నాగబాబు గారికి జబర్దస్త్ షో ఎలాంటి గుర్తింపుని తెచ్చిపెట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈ షోకి క్రేజ్ తీసుకొని రావడం లో ఆయన ఎంతో కృషి చేసారు..సుమారుగా 8 ఏళ్ళ పాటు జబర్దస్త్ లో జడ్జి గా కొనసాగిన నాగబాబు ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈటీవీ మరియు మల్లెమాల నుండి బయటకి వచ్చి జీ తెలుగు మరియు మా టీవీ లో షోస్ చేసుకునేవారు..కొన్ని షోస్ ని ఆయన స్వయంగా నిర్మించాడు కూడా..అంతే కాకుండా యూట్యూబ్ లో ‘నా ఛానల్ నా ఇష్టం’ పేరు తో ఒక ఛానల్ ని కూడా ప్రారంభించి అందులో తన అభిప్రాయాలను పంచుకోవడం తో పాటుగా, ఎన్నో వెబ్ సిరీస్ లను నిర్మించాడు.

అయితే నాగబాబు జబర్దస్త్ షో కి మళ్ళీ తిరిగి వస్తే బాగుండును అని అభిమానులు ఎప్పటి నుండో కోరుకుంటున్నారు..ఆయన ఎందుకు ఆ షో ని వదిలి వెళ్లారు అనేది సరిగా తెలియకపోయిన ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
‘జబర్దస్త్ షో అనేది నా జీవితంలో ఎంతో కీలకమైన ఘట్టం..నేను ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఈ షో నన్ను ఎంతగానో ఆడుకుంది..కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడడం వల్ల నేను ఆ షో నుండి బయటకి వచ్చేసాను కానీ..మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ తో నాకు ఎలాంటి విభేదాలు లేవు..శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు నాకు ఎంతో కావాల్సిన మనిషి..ఆయన మళ్ళీ నన్ను జబర్దస్త్ లో కావాలని కోరుకొని స్వాగతిస్తే కచ్చితంగా వెళ్తాను..నాకు ఎలాంటి ఇబ్బందులు లేవు’ అంటూ నాగబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

నాగబాబు రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే వార్త..ప్రస్తుతం నాగబాబు ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ లో ఒక ముఖ్యనేతగా చాలా బిజీ గా ఉన్నాడు..ఇటీవలే జనసేన పార్టీ అద్వర్యం లో జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో నాగబాబు పాల్గొంటూ ఉన్నారు..మరో పక్క ఆయన సినిమాల్లో నటిస్తూ మరియు వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు.