Nagababu: మెంటల్ కృష్ణగా పేరు ప్రఖ్యాతులు సాధించిన పోసాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై వివాదాస్పదమైన ఆరోపణలు చేయడం.. దాంతో పోసాని పై పవన్ అభిమానులు ఎటాక్ చేయడం.. పోసానికి సపోర్ట్ గా జగన్ అనుచరులు రంగంలోకి దిగడం.. మొత్తానికి ఈ వ్యవహారం ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇప్పటికే వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు చేస్తున్నారు.
పవన్ గురించి పర్సనల్ గా ఇంత రచ్చ జరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా మెగా బ్రదర్ నాగబాబు ఈ వివాదంలోకి తనదైన శైలిలో స్పందించారు. తన ఇంస్టాగ్రామ్ లో నాగబాబు తాజాగా ‘ఆస్క్ మీ’ సెషన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోసాని వివాదం పై అభిమానులు అడిగిన అన్ని ప్రశ్నలకు నాగబాబు తనదైన సమాధానాలిచ్చారు.
ఓ నెటిజన్ ‘పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన కామెంట్స్ గురించి స్పందించండి’ అని అడగగా.. గతంలో పవన్ కళ్యాణ్ గురించి పోసాని మాట్లాడిన ఓ వీడియోని పోస్ట్ చేశారు. ఆ వీడియోలో ‘పవన్ కళ్యాణ్ మళ్ళీ హీరోగా సినిమా చేస్తానంటే ఆయనకు నేను బ్లాంక్ చెక్ ఇస్తాను. ఇరవై, ముప్పై కోట్లు… సినిమాకి డేట్స్ ఇస్తే 40 కోట్లు కూడా ఇస్తాను. పవన్ కి అంత డిమాండ్ ఉంది. ఇండియాలోని టాప్ హీరోల్లో పవన్ ఒకరు. 5, 10 కోట్ల కోసం ఆయన లంగా పనులు చేయరు. నాకు తెలుసు’ అని పోసాని చెప్పుకొచ్చాడు.
ఇక పోసాని గురించి ఒక్క మాట చెప్పండి అని మరో నెటిజన్ అడగ్గా… ‘సమరసింహారెడ్డి’లో బాలకృష్ణ ఫొటో పోస్ట్ చేయడం విశేషం. ఆ ఫోటోలో బాలయ్య బాబు ‘కుక్క మొరిగిందనుకో’ అనే మాట చెబుతాడు. మొత్తానికి మెగా బ్రదర్ నాగబాబు ఒక వీడియో అండ్ చిన్న మీమ్ తో ఘాటుగా క్లారిటీ ఇచ్చాడు.
ఇక నాగబాబు రాజకీయ ఎంట్రీ పై మరో నెటిజన్ అడుగుతూ ‘మీరు మళ్ళీ పాలిటిక్స్ లోకి వస్తారా ?’ అని అడగగా… ‘నాకు ఇంట్రెస్ట్ పోయింది’ అనే మీమ్ ను పోస్ట్ చేశాడు. ఏది ఏమైనా నాగబాబు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
