Naga Srinu Sensational Comments On Manchu Vishnu : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఆఫీసులో చోరీ జరిగిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై మంచు విష్ణు, అతడి మేనేజర్ సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్ మెంట్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని..విష్ణు హెయిర్ డ్రెస్సర్ గా పనిచేసే నాగశీను పై అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలోనే నాగశీను ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు.

అందులో మంచు విష్ణు, మంచు మోహన్ బాబు బాగోతాన్ని బయటపెట్టారు. వారు తన పట్ల వ్యవహరించిన తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు, విష్ణు కలిసి తనను చిత్రహింసలు పెట్టి చెప్పుకోలేని విధంగా బూతులు తిట్టి కులం పేరుతో అవమానించారని నాశశీను ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కారణంగా ఉద్యోగం మానేసినందుకు 5 లక్షల విలువ చేసే హెయిర్ డ్రెస్సింగ్ సామగ్రి చోరీ అని అక్రమంగా కేసు పెట్టారని నాగశీను వాపోయారు.
Also Read: సిగరెట్ తాగుతూ తేజస్వి, ముమైత్ అరాచకం.. బ్యాంకాక్ బీచ్‌లో అలా అంటూ..!
తనను మోకాళ్లపై కూర్చుండబట్టి నానా బూతులు తిట్టిన వీడియో సీసీటీవీలో రికార్డ్ అయ్యిందని.. ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 1 గంటకు ఈ సంఘటన జరిగిందని.. సీసీటీవీలో ఇదంతా రికార్డ్ అయ్యిందని ఆరోపించారు.ఈ వార్త విన్న మాతల్లి ఆస్పత్రి పాలైందని.. గుండెపోటుతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యిందని.. దానికి కారణం విష్ణు, మోహన్ బాబు అన్నారు.
10 ఏళ్లుగా మోహన్ బాబు దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నానని.. తనపై కావాలనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారని ఆరోపించారు. నాలాంటి పేదవాడి జీవితంతో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మోహన్ బాబు ఫ్యామిలీ తనను అసభ్యపదజాలంతో దూషించారని తాను ఉద్యోగం మానేశానని.. ఎలాంటి దొంగతనం చేయలేదని స్పష్టం చేశారు.
Also Read: అతని మీదే మనసు పారేసుకుంటున్న అమ్మాయిలు.. బిగ్ బాస్‌లో కొత్త టాస్క్