Homeఎంటర్టైన్మెంట్బిజీ హీరో క్రేజీ ప్రాజెక్టులు.. కొత్త టాలెంట్ కే పెద్దపీట !

బిజీ హీరో క్రేజీ ప్రాజెక్టులు.. కొత్త టాలెంట్ కే పెద్దపీట !

naga shaurya crazy projects‘నాగశౌర్య’ టాలీవుడ్ మోస్ట్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లోనే.. క్రేజ్ ఉన్న క్రేజీ హీరో. ప్రస్తుతం ఐదు సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న ఏకైక మోస్ట్ వాంటెడ్ హీరో కూడా ‘నాగశౌర్య’నే. లవర్ బాయ్ ఇమేజ్ తో తిరుగులేని క్లాస్ హీరోగా ఎదిగిన శౌర్య.. తన కొత్త సినిమా ‘లక్ష్య’లో అద్భుతమైన బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ తో, పక్కా యాక్షన్ హీరో లుక్ లో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లను కూడా మెస్మరైజ్ చేస్తున్నాడు. మునుపెన్నడు చూడని విధంగా శౌర్య ఈ సినిమా కోసం పర్ఫెక్ట్ బాడీతో సిక్స్‌ ప్యాక్‌ లో డిఫరెంట్‌ లుక్‌ తో కనిపించబోతున్నాడు.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)


ఈ లుక్ కోసం జిమ్ లో కఠినమైన వర్కౌట్లు చేస్తూ.. ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇవ్వడం కోసం తనని తానూ సరికొత్తగా మార్చుకున్నాడు శౌర్య. ఆర్చరీ స్పోర్ట్స్ నేపథ్యంలో విభిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా అద్భుతంగా వచ్చింది. తెలుగు వెండితెర పై కొత్త ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో ‘నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్’ నిర్మాతలుగా ఈ సినిమా రానుంది.

 

View this post on Instagram

 

A post shared by Naga Shaurya (@actorshaurya)


ఇటు ‘లక్ష్య’ లాంటి వైవిధ్యమైన సినిమా చేస్తూనే.. మరోపక్క ఫ్యామిలీస్ ఫేవరేట్ మూవీగా చేస్తోన్న మరో మూవీ ‘వరుడు కావలెను‘. ‘లక్ష్మీ సౌజన్య’ ను దర్శకురాలిగా పరిచయం చేస్తూ చేస్తోన్న ఈ చిత్రం ద్వారా నాగ శౌర్య ఫ్యామిలీ ఆడియన్స్ కు మరింత దగ్గర కానున్నాడు. ఆ మధ్య ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ‘‘కోలకళ్ళే ఇలా గుండే గిల్లే ‘ పాట సంగీత, సాహిత్యాల కలబోతగా సంగీత ప్రియులకు బాగా చేరువ అయింది. అలాగే ఈ క్లాసిక్ మూవీ నుండి వచ్చిన అన్నీ ప్రచారాలకు ప్రేక్షకాభిమానుల నుంచి ఎన్నో ప్రశంసలు అందడం విశేషం.


అలాగే నాగశౌర్య నుండి శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి’. ఈ సినిమాలో మాళవిక నాయర్ హీరోయిన్. ‘కళ్యాణ వైభోగమే’లో ‘శౌర్య – మాళవిక నాయర్’కి సూపర్ హిట్ కాంబినేషన్ అనే ప్రశంసలు దక్కాయి. పైగా ఆ సినిమాతో మంచి విజయం కూడా అందుకున్నారు. ఇక ‘నాగసౌర్య – అవసరాల శ్రీనివాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘ఊహలు గుస గుస లాడే, జో అచ్యుతానంద’ చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. మరి ఈ క్రేజీ హిట్ కాంబినేషన్స్ లో ఈ చిత్రం వినూత్న లవ్ స్టోరీతో వస్తోంది కాబట్టే.. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

నాగశౌర్య చేస్తోన్న మరో డిఫరెంట్ ఫిల్మ్ ‘పోలీస్ వారి హెచ్చరిక’. కామెడీ, ఎమోషన్, మెసేజ్ ఇలా అన్ని అంశాలతో పర్ఫెక్ట్ స్క్రిప్ట్ తో ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మాణంలో రానుంది ఈ ప్రత్యేక సినిమా. టైటిల్ తోనే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం, తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఈ సినిమాకి కూడా నూతన దర్శకుడు ‘కేపీ రాజేంద్ర’ దర్శకత్వం వహిస్తున్నాడు.

‘గాలి సంపత్’ మూవీ ఫేమ్ దర్శకుడు అనీష్ కృష్ణతో మరో మూవీ చేస్తున్నాడు శౌర్య. గత వారమే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. మంచి రోమ్ కామ్ ఎంటర్టైనర్ గా మంచి బజ్ తో రానున్న ఈ చిత్రాన్ని ‘ఐరా క్రియేషన్స్’ వారు నిర్మాణం వహిస్తుండటం విశేషం. పైగా ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటి రాధిక కూడా కీలక పాత్రలో నటిస్తుండటం, సంచలన మ్యూజిక్ డైరెక్టర్ మహతి సాగర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటం మరో విశేషం.

మొత్తమ్మీద ‘నాగశౌర్య’ చేస్తున్న ఐదు సినిమాల పై ఉన్న భారీ అంచనాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. నిజానికి ఒకటి రెండు హిట్లు ఉన్న హీరోలు కూడా ఫామ్ లో ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తున్నారు. కానీ, ‘నాగశౌర్య’ మాత్రం కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ.. ఒకేసారి ముగ్గురు కొత్త దర్శకులకు ఛాన్స్ ఇవ్వడం శౌర్యకి మాత్రమే సాధ్యమైన గొప్పతనం. పైగా నాగశౌర్యలో మంచి రచయిత కూడా ఉన్నాడు.

‘ఛలో, అశ్వద్దామ’ లాంటి సూపర్ హిట్ చిత్రాల విజయాలకు నాగశౌర్య రచనే ముఖ్య కారణం. మరి, ఈ ‘క్రేజీ స్టార్ హీరో’ ఇలాగే మరిన్ని విభిన్న వినూత్న సినిమాలు చేస్తూ ఈ కరోనా కష్టకాలంలో సినీ కార్మికులకు ఇలాగే ఉపాధి కల్పిస్తూ ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular