Thank You: ఇటీవల లవ్‌స్టోరీ సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. సూపర్ హిట్ అందుకున్నారు అక్కనేని నాగచైతన్య. శేఖర్ కమ్ముల దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్గా నటించింది. ఇందులో నాగచైతన్య నటనకు అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా, ప్రస్తుతం థాంక్యూ చిత్రంలో నటిస్తున్నారు చైతన్య. ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం. చివరగా కొన్ని ప్యాచ్ వర్క్స్ మిగిలి ఉన్నాయని తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రబృందం మూడు రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అనంతరం, మైసూర్లో మరో చిన్న షెడ్యూల్ జరగనున్నట్లు సమాచారం. అందులోనే ఈ ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. దీంతో థాంక్యూ సినిమా షూటింగ్ పూర్తవుతుందని సీనీ వర్గాల్లో టాక్.

మరోవైపు తండ్రి నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలోనూ సందడి చేసేందుకు సుద్ధమయ్యారు నాగచైతన్య. ఇందులో సహకథానాయకుడి పాత్రలో కనిపించనున్నారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తుండగా.. చైతుకు జోడీగా కృతి శెట్టి కనిపించనుంది. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం.. 2022 సంక్రాంతికి బరిలో దిగేందుకు మెకర్స్ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.