
Naga Chaitanya Superb Speech: అఖిల్, పూజా హెగ్డే జంటగా రానున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్ర విడుదల ముందస్తు వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చాడు చైతు. అయితే చైతు ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా.. ఆ సినిమా కోసం పని చేసే విధానాన్నే ఎక్కువ ప్రేమిస్తాడని, ఎక్కువ ఎంజాయ్ చేస్తాడని.. అఖిల్ లో ఆ లక్షణం తనకెంతో నచ్చుతుందని చైతు చెప్పుకొచ్చాడు.
ఇక దర్శకుడు భాస్కర్ గురించి చైతు గొప్పగా మాట్లాడటం విశేషం. ‘భాస్కర్ లో ఎమోషన్స్ ఉన్నాయి. అతను మనుషుల మధ్య ఉండే ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా డీల్ చేయగలడు’ అని కామెంట్స్ చేసాడు. నిజానికి భాస్కర్ పై సినిమా టీం అసంతృప్తిగా ఉంది. అందుకే భాస్కర్ ను పెద్దగా పట్టించుకోవడం లేదు.
ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న భాస్కర్ కి చైతు మాటలు (Naga Chaitanya Superb Speech)ఊరటను కలిగించాయి. అయితే అఖిల్ కూడా భాస్కర్ గురించి ఒక కామెంట్ చేశాడు. భాస్కర్ మెదడులో యుద్ధాలు జరుగుతుంటాయని, ఓ సీన్‌ని ఎలా తీయాలి అంటూ ఎప్పుడూ తపన పడుతుంటాడని అన్నాడు. ఇక్కడ అఖిల్ ఉద్దేశ్యం ఏమిటంటే.. బాస్కర్ దేనికి ఒకదానికి ఫిక్స్ అవ్వడు అని.
ఇక అఖిల్ కి ఈ సినిమా ఎంతవరకు హిట్ ను ఇస్తోందో చూడాలి. ఈ కొవిడ్ పరిస్థితుల్లో థియేటర్లలో సినిమాలు ఆడతాయా? లేదా? అని టెన్షన్ పడుతున్న సమయంలో చైతు ‘లవ్‌స్టోరీ’ సినిమా వచ్చి.. మంచి కలెక్షన్స్ ను రాబట్టింది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్స్ కి తీసుకొచ్చింది. మరీ అక్టోబరు 15న థియేటర్లలోకి వస్తున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.
అఖిల్ ని స్టార్ హీరోని చేయాలని, మెయిన్ గా తెలుగు ప్రేక్షకులందరి దగ్గరికి చేయాలనే లక్ష్యంతో మేకర్స్ ఈ సినిమాని చేశారు. అందుకే అఖిల్ ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది. కాబట్టి.. అఖిల్ కెరీర్‌లో ఓ మంచి సినిమాగా ఈ చిత్రం మిగులుతుందా ? లేక ఎప్పటిలాగే ప్లాప్ చిత్రంగా నిలిచిపోతుండా ? చూడాలి.