Naga Chaitanya Second Marriage: సౌత్ ఇండియా లో గత కొంతకాలం నుండి ఒక్క రేంజ్ లో చర్చ నడుస్తున్న టాపిక్ సమంత మరియు నాగ చైతన్యల విడాకుల వ్యవహారం..ఎవ్వరు కూడా వీళ్లిద్దరు విడాకులు తీసుకుంటారు అని బహుశా కలలో కూడా ఊహించి ఉండరు, అలా ఎవ్వరు ఊహించినది జరిగింది కాబట్టే ఇప్పటికి సోషల్ మీడియా లో ప్రతి రోజు వీళ్లిద్దరికీ సంబంధించిన ఎదో ఒక్క వార్త ప్రచారం అవుతూనే ఉంది..సోషల్ మీడియా లో తన పై వస్తున్న కొన్ని అసత్య ప్రచారాలు చూసి విసుగెత్తిపోయిన సమంత కొన్ని యూట్యూబ్ చానెల్స్ పై కేసు కూడా వేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయిన కూడా వీళ్లిద్దరి గురించి వార్తలు రావడం ఆగడం లేదు..అయితే ఇప్పుడు తాజాగా సోషల్ మీడియా లో ఒక్క వార్త గత కొంతకాలం నుండి ఒక్క రేంజ్ లో ప్రచారం అవుతుంది..అదేమిటి అంటే అక్కినేని నాగార్జున గారు నాగ చైతన్య కి రెండవ పెళ్లి చెయ్యడానికి సిద్ధం అయ్యాడు అని..ఇందుకు గాను నాగ చైతన్య తో ఆయన పలుమార్లు చర్చలు జరిపి ఆయనని రెండవ పెళ్ళికి ఒప్పించారు అని సోషల్ మీడియా లో ఒక్క వార్త గత కొంతకాలం నుండి ప్రచారం సాగుతుంది..దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం చూడబోతున్నాము.

ఇక అసలు విషయానికి వస్తే అక్కినేని నాగార్జున గారు కొనేళ్ల క్రితం నాగ చైతన్య మరియు అఖిల్ కి ఒక్కేసారి పెళ్లి చెయ్యాలనుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..అఖిల్ తో శ్రేయ భూపాల్ అనే అమ్మాయి తో నిశ్చితార్థం కూడా చేసారు నాగార్జున..ఇద్దరి కొడుకుల పెళ్లిళ్లు ఒక్కే సమాయం లో చెయ్యాలి అనుకుంటున్నా సమయం లో ఎందుకో కొన్ని విభేదాల వల్ల చివరి నిమిషం లో అఖిల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది..దాని తర్వాత మళ్ళీ అఖిల్ పెళ్లి వ్యవహారం గురించి మీడియా లో ఎలాంటి వార్తలు రాలేదు..అయితే ఇప్పుడు అఖిల్ కి పెళ్లి చెయ్యడం కోసం గత కొంత కాలం నుండి నాగార్జున సంబంధాలు చూస్తున్నాడు అట..అఖిల్ తో పాటుగా నాగ చైతన్య కి కూడా ఒక్కేసారి పెళ్లి చెయ్యాలనే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి..ఇందుకు నాగ చైతన్య కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది..అయితే కొన్ని రోజుల నుండి నాగ చైతన్య ఒక్క ప్రముఖ టాప్ హీరోయిన్ తో డేటింగ్ లో ఉన్నాడు అనే వార్తలు వస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..రెండవసారి కూడా నాగ చైతన్య ప్రేమ వివాహం చేసుకుంటాడా లేదా పెద్దలు కుదిరించిన సంబంధం ని చేసుకుంటాడా అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది..దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Also Read: 150 కోట్లు పెట్టి కొన్నారు..మొదటి రోజే ఎంత లాభాలు వచ్చాయో తెలుసా??
ఇక నాగ చైతన్య ప్రస్తుతం సినీ కెరీర్ పరంగా మంచి ఊపు మీద ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..లవ్ స్టోరీ మరియు బంగార్రాజు వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ తో యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ తో థాంక్యూ అనే సినిమాలో నటిస్తున్నాడు..షూటింగ్ కార్యక్రమాలు అన్ని దాదాపుగా పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకి రాబోతుంది..ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా తో పాటు ఆయన బాలీవుడ్ లో అమిర్ ఖాన్ తో కలిసి చేసిన లాల్ సింగ్ ఛధా అనే సినిమా కూడా ఆగష్టు 12 వ తేదీన విడుదలకు సిద్ధం గా ఉంది..ఫారెస్ట్ గంప్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీ లో నాగ చైతాయా ఒక్క ముఖ్య పాత్ర ని పోషించాడు..ఇక వీటితో పాటుగా ఒక్క వెబ్ సిరీస్ లో కూడా నటించబోటున్నాడు నాగ చైతన్య..ఇక అక్కినేని అఖిల్ సినిమాల విషయానికి వస్తే గత ఏడాది ఆయన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అనే సినిమాతో కెరీర్ లో తొలిసారి హిట్ అందుకున్న సంగతి మన అందరికి తెలిసిందే..ఇప్పుడు ఆయన ప్రముఖ స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో ఏజెంట్ అనే సినిమాలో నటిస్తున్నాడు..ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి..ఆగష్టు 12 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమా తో అఖిల్ కెరీర్ మలుపు తిరగబోతుంది అని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త..ఇది ఎంత వరుకు నిజమో తెలియాలి అంటే ఆగష్టు వరుకు వేచి చూడాల్సిందే.
Also Read: KGF Chapter2 మొదటి రోజు వసూళ్లు
[…] Also Read: ఆ హీరోయిన్ తో నాగ చైతన్య రెండవ పెళ్లి?… […]