Naga Chaitanya: కొంతమంది హీరోలు మాస్ హీరోలుగా పేరు తెచ్చుకుంటే.. మరి కొంతమంది క్లాస్ హీరోలుగా పేరు తెచ్చుకుంటారు. క్లాసును మాస్ ను మెప్పించగలిగే హీరోలు చాలా కొద్దిమంది ఉంటారు. కాగా అక్కినేని హీరో నాగ చైతన్య కి జోష్, దడ, ఆటోనగర్ సూర్య, బెజవాడ, సవ్యసాచి, కస్టడీ లాంటి మాస్ సినిమాలు నిరాశను మిగిల్చగా.. ఏం మాయ చేసావే, 100% లవ్, మజిలీ, ప్రేమమ్, లవ్ స్టోరీ లాంటి క్లాస్ సినిమాలు హిట్లను తెచ్చి పెట్టాయి. మొత్తానికి చైతు మాస్ హీరో గా కన్న క్లాస్ హీరో గానే మెపిస్తూ వచ్చాడు.
కానీ ఆయన హిట్ సినిమాల్లో మరో విశేషం ఏమిటి అంటే చైతన్యకు సూపర్ హిట్ సాధించిన ప్రతి సినిమా ఎక్కువగా హీరోయిన్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలే. మొదటగా ఏం మాయ చేసావే.. అలానే మజిలీ లాంటి సినిమాలు నాగచైతన్య కన్నా కూడా సమంతకే పేరు తెచ్చిపెట్టాయి. ఏం మాయ చేసావే సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ కి వెళ్ళిపోయింది సమంత. ఇక మజిలీ సినిమాలో కూడా సమంత క్యారెక్టర్ కి ఎక్కువ ప్రశంసలు వచ్చాయి.
ఇక ఆ తరువాత వచ్చిన 100% లవ్ సినిమా సైతం సుకుమార్ డైరెక్షన్ కి.. తమన్నా యాక్టింగ్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. చైతు క్యారెక్టర్ కి ఎంత ప్రాధాన్యత ఉందో తమన్నా క్యారెక్టర్ కి కూడా ఆ సినిమాలో అంతే ప్రాధాన్యత ఉంది. ఇక ప్రేమమ్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ అలానే శృతిహాసన్ క్యారెక్టర్లు హైలెట్ గా నిలిచాయి. ఇక మనం సినిమా గురించి పక్కన పెడితే…రారండోయ్ వేడుక చూద్దాం సినిమా కూడా బ్రమరాంబిక క్యారెక్టర్ చుట్టూ ఎక్కువ తిరుగుతుంది.
ఇక ఈమధ్య నాగచైతన్య సినిమాల్లో హిట్ అయిన లవ్ స్టోరీ సినిమా లో సైతం నాగచైతన్య కన్నా సాయి పల్లవికే ఎక్కువ పేరొచ్చింది. అంతేకాదు ఆ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ కే ప్రాధాన్యత ఎక్కువ.
ఇలా నాగచైతన్య తన కెరియర్ లో హిట్లు అందుకున్న సినిమాలు అన్ని హీరోయిన్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉన్న చిత్రాలే. అలా కాదు సోలోగా సూపర్ హిట్ అందుకుందాం అనుకుంటే మాత్రం అలాంటి సినిమాలు నాగచైతన్య కి నిరాశ మిగులుస్తున్నాయి. దీంతో హీరోయిన్ ప్రాధాన్యత లేని సినిమాలతో అసలు చైతన్య హిట్ అందుకోలేదా అని చాలామంది సోషల్ మీడియాలో తమ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాదు ఈసారి మళ్లీ హిట్ అందుకోవాలని సాయి పల్లవి సహాయం తీసుకోబోతున్నారంట చైతు. నాగ చైతన్యతో మళ్లీ నటించేందుకు సాయి పల్లవి రెడీ అయిందట. చందూ మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య నటించబోతున్న చిత్రంలో సాయి పల్లవి హీరోయిన్ గా తీసుకున్నారు అని తెలుస్తోంది. కాగా సాయి పల్లవి ఈ సినిమా ఒప్పుకుంది అంటే తప్పకుండా తన క్యారెక్టర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది ఉంటది. లేకపోతే ఈ హీరోయిన్ ఒప్పుకోదు. ఇక చైతు కూడా సూపర్ హిట్ కోసం చూస్తున్నారు కాబట్టి మళ్లీ హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న సినిమాతో హిట్ కొట్టాలి అని నిర్ణయించుకున్నట్టు ఉన్నారు. కాబట్టి ఇప్పటివరకు జరిగిన లాగానే ఈసారి కూడా చైతుకి సాయి పల్లవి ద్వారా సూపర్ హిట్ వస్తుందేమో వేచి చూద్దాం.