https://oktelugu.com/

Naga Chaitanya-Sobhitha wedding : కాసేపట్లో పెళ్లి అనగా.. నాగ చైతన్య, శోభిత సీక్రెట్ ఫోటోలు లీక్!

నాగ చైతన్య వివాహం నేడు. డిసెంబర్ 4న రాత్రి 8:13 నిమిషాలకు ముహూర్తం అని సమాచారం. సడన్ గా నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల సీక్రెట్ ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ మేటర్ టాలీవుడ్ వర్గాల్లో చర్చకు దారి తీసింది. విషయంలోకి వెళితే...

Written By:
  • S Reddy
  • , Updated On : December 4, 2024 / 08:45 PM IST

    Naga Chaitanya-Sobhitala's wedding

    Follow us on

    Naga Chaitanya-Sobhitha wedding : నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. నేడు అన్నపూర్ణ స్టూడియో వేదికగా కళ్యాణం జరుగుతుంది. శోభిత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. ఈ క్రమంలో అదే సాంప్రదాయంలో పెళ్లి తంతు నిర్వహిస్తున్నారు. దాదాపు 8 గంటలు పెళ్లి కార్యక్రమం జరుగుతుందట. ఇక నిరాడంబరంగా కేవలం సన్నిహితులు, కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఆహ్వానం లభించింది. 300 మందిని సెలెక్టివ్ గా పెళ్ళికి పిలిచారట. శోభిత, నాగ చైతన్యల నిర్ణయం ప్రకారం పెళ్లి సింపుల్ గా చేస్తున్నట్లు నాగార్జున వెల్లడించారు.

    కాగా నాగ చైతన్య, శోభిత చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. వీరి ప్రేమ వ్యవహారం ఓ రెండేళ్ల క్రితం వెలుగులోకి వచ్చింది. పుకార్లు చెలరేగాయి. నాగ చైతన్య తాను కొత్తగా నిర్మించుకుంటున్న ఇంటికి శోభితను తీసుకెళ్తూ ఉండేవాడట. శోభిత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నారంటూ వచ్చిన కథనాలను ఖండించారు. నాగ చైతన్య టీమ్ ఇవన్నీ నిరాధార కథనాలు అంటూ స్పష్టత ఇచ్చారు. అయితే ఒకటి రెండు సందర్భాల్లో ఈ జంట కెమెరా కంటికి చిక్కారు. విదేశాల్లో విహరిస్తూ కనిపించారు.

    అప్పుడు వార్తల్లో నిజం ఉందన్న వాదన బలపడింది. కాగా శోభిత, నాగ చైతన్య డేటింగ్ చేసినప్పటి ఫోటోలు బయటకు వచ్చాయి. కాసేపట్లో పెళ్లి అనగా… ఈ ప్రైవేట్ ఫోటోలు బయటకు రావడం చర్చకు దారి తీసింది. ఈ ఫోటోలు ఎలా పబ్లిక్ లోకి వచ్చాయంటే… దగ్గుబాటి రానా ప్రైమ్ వీడియోలో ఒక టాక్ షో చేస్తున్నాడు. ఈ షోకి గెస్ట్ గా నాగ చైతన్య వచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో రానా విడుదల చేశాడు. సదరు ఫోటోల్లో నాగ చైతన్య, శోభిత డేటింగ్ చేసినప్పటి ఫోటోలు ఉన్నాయి. ఈ క్రమంలో రానా దగ్గుబాటి షో ప్రోమో వైరల్ అయ్యింది.

    అధికారికంగా పెళ్లితో ఒక్కటి అవుతున్న నాగ చైతన్య తన ప్రైవేట్ ఫోటోలు విడుదల చేశాడు. ఇప్పటి వరకు ఆ ఫోటోలను నాగ చైతన్య బయటపెట్టలేదు. నిశ్చితార్థం అయ్యాక కూడా రహస్యంగానే ఉంచారు. కాగా శోభిత, నాగ చైతన్య కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. వీరికి ఎలా పరిచయం ఏర్పడింది, ప్రేమకు ఎలా దారితీసిందో తెలియదు. భవిష్యత్ లో నాగ చైతన్య దంపతులు తెలియజేసే అవకాశం ఉంది.