
యంగ్ బ్యూటీ ‘నభా నటేష్’కి కాస్త లౌక్యం ఎక్కువట. ఛాన్స్ ల కోసం తన తెలివితేటలకు బాగానే పదును పెడుతుంది ఈ బ్యూటీ. తెలుగులో నభా నటేష్ కొంచెం డల్ అయిన మాట వాస్తవం. అందుకే తిరిగి బిజీ అవ్వడానికి నభా నటేష్ విపరీతంగా ప్రయత్నాలు మొదలెట్టింది. ఇందులో భాగంగా నభా నటేష్ ఇంటర్వ్యూలు ఈ మధ్య ఇంగ్లీష్ మీడియాలో బాగా కనిపించాయి.
అలాగే ఆమె ఎన్టీఆర్ – కొరటాల సినిమాలో కూడా నటించబోతుందని, ఇప్పటికే ఆమెకు కొరటాల నుండి ఆఫర్ కూడా వచ్చింది అన్నట్టు వార్తలు వచ్చాయి. అసలు ఎన్టీఆర్ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ ఏమిటీ ? అని నెటిజన్లు అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆమె పై విరుచుకుపడుతున్నారు. నభా నటేష్ కి అంత సీన్ లేదని వాళ్ళు ఫైర్ అవుతున్నారు.
అయినా నభా నటేష్ పేరు అనూహ్యంగా ఎన్టీఆర్ సినిమాలో వినిపించడం, అదే విధంగా సందర్భం లేకుండా ఆమె ఇంటర్వ్యూలు రావడం వెనుక కారణాన్ని ఆరా తీస్తే.. నభా నటేష్ డబ్బులిచ్చి మరీ తన పై ఇంటర్వ్యూలు చేయించుకుందని, అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నభా నటేష్ కి ఛాన్స్ అంటూ తన గురించి తానే ఆర్టికల్స్ రాయించుకుందని తెలుస్తోంది.
మొత్తానికి పీఆర్ పరంగా నభా నటేష్ చాలా అగ్రెసివ్ గా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ కారణంగా సినిమా షూటింగ్స్ కి బ్రేక్ పడ్డాయి. షూట్ మొదలుపెట్టాల్సిన కొత్త సినిమాలు కూడా ప్రస్తుతానికి ఆగిపోయాయి. మళ్ళీ స్టార్ట్ అయ్యే సినిమాల్లో తనకు ఛాన్స్ లు రావాలి అన్నా.. అలాగే జనాల దృష్టిలో పడటానికి కూడా తనకు ఇదే సరైన సమయమని నభా నటేష్ ఫీల్ అవుతుందట.
తెలుగులో కొంత గ్యాప్ తర్వాత మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పక్కా కమర్షియల్ చిత్రంలో కూడా నభా నటేష్ సెకెండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఫస్ట్ హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెది లాయర్ పాత్ర. దీంతో పాటు బాలీవుడ్ లో కూడా ఆఫర్లు కోసం నభా నటేష్ బాగానే కష్టపడుతుంది. కానీ ఆమెకు మాత్రం ఇప్పటివరకూ ఒక్క బాలీవుడ్ మూవీ కూడా రాలేదు.