https://oktelugu.com/

Nabha Natesh: ప్రియదర్శికి వార్నింగ్ ఇచ్చిన నభా నటేష్… ప్రభాస్ కారణంగా రచ్చకెక్కిన గొడవ!

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అనంతరం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. అలాగే ఆమె భుజానికి గాయం కాగా, శస్త్రచికిత్స చేశారట. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లో పడింది.

Written By:
  • S Reddy
  • , Updated On : April 18, 2024 / 12:37 PM IST

    Nabha Natesh vs Priyadarshi

    Follow us on

    Nabha Natesh: హీరోయిన్ నభా నటేష్ తాజాగా ఓ డబ్స్మాష్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఆమె ప్రభాస్ డార్లింగ్ అంటూ చెప్పే పదాలతో డబ్స్మాష్ చేసింది. ఈ వీడియోపై నటుడు ప్రియదర్శి రియాక్ట్ అయ్యాడు. ఆమెను డార్లింగ్ అని పిలిచాడు. దీంతో నభా నటేష్ అతనికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నెట్టింట తెగ వైరల్ గా మారింది. ఈ తాజా వివాదం ఏమిటో చూద్దాం. నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది కన్నడ భామ నభా నటేష్.

    ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది. అనంతరం ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. అలాగే ఆమె భుజానికి గాయం కాగా, శస్త్రచికిత్స చేశారట. దాంతో సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బ్యూటీ ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లో పడింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ క్రేజీ ప్రాజెక్టు ఉంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు లో నటిస్తుంది. భరత్ కృష్ణ మూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు.

    కాగా నభా నటేష్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్ అవుతుంది. ప్రభాస్ ఊతపదం డార్లింగ్. ఆయన అందరినీ డార్లింగ్ అని బోధిస్తాడు. ఇక ఫ్యాన్స్ సైతం ఆయన్ని డార్లింగ్ ప్రభాస్ అంటారు. ప్రభాస్ పలు సందర్భాల్లో డార్లింగ్ అని చెప్పిన పదాలు అన్నింటినీ కలిపి ఒక రీల్ చేసింది. ఈ రీల్ ఇప్పుడు నెటిజన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది. ఈ వీడియో పై నటుడు ప్రియదర్శి స్పందించాడు. వావ్ సూపర్ డార్లింగ్.. కిరాక్ ఉన్నావ్ డార్లింగ్, అంటూ కామెంట్ చేశాడు.

    దీంతో నభా నటేష్ ఫైర్ అయింది. మాటలు జాగ్రత్త .. ఎవరో తెలియని మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపులకు కిందకే వస్తుందని కోర్టు తీర్పు చూపించింది. దీంతో ప్రియదర్శి ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. అమ్మాయిలు అయితే డార్లింగ్ అని పిలవొచ్చు .. మేము పిలిస్తే ఐపీసీ సెక్షన్ పెడతారా .. లైట్ తీసుకో డార్లింగ్ అంటూ కామెంట్ చేశాడు. దీంతో ప్రియదర్శి, నభా నటేష్ మధ్య ట్విట్టర్ ఎక్స్ లో కామెంట్స్ వార్ నడుస్తుంది. సీరియస్ గా వీరిద్దరూ గొడవపడుతున్నారా లేక ఏదైనా ప్రమోషనల్ స్టంటా? అనే సందేహం కలుగుతుంది.