RRR – CM Jagan:#RRR మూవీ కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ‘ క్యాటగిరి లో ‘నాటు నాటు’ పాటకి ఆస్కార్ అవార్డు దక్కడం తో యావత్తు సినీ అభిమానులు సోషల్ మీడియా లో ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.అలాగే సెలెబ్రిటీలు మరియు రాజకీయ నాయకులు కూడా ఈ సందర్భంగా కృతఙ్ఞతలు తెలిజేస్తున్నారు.మన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వై ఎస్ జగన్ కూడా ఈ సందర్భంగా #RRR మూవీ టీం కి శుభాకాంక్షలు తెలియజేసారు.

‘తెలుగు జెండా ని అంతర్జాతీయ వేదికలపై రెపరెపలాడించినందుకు నేను మరియు కోట్లాది మంది తెలుగు ప్రజలు ఎంతో గర్వపడుతున్నాము.ఈ సందర్భంగా రామ్ చరణ్ , ఎన్టీఆర్ , రాజమౌళి, కీరవాణి మరియు చంద్రబోస్ గార్లకు, RRR మూవీ టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలిజేస్తున్నాము’ అంటూ జగన్ ఒక ట్వీట్ వేసాడు.మంచిగానే వేసాడు కదా ఇందులో తప్పేమి ఉంది అని మనకి అనిపించొచ్చు.కానీ ఒక బాలీవుడ్ గాయకుడు జగన్ ట్వీట్ కి చాలా సమాధానం ఇచ్చాడు.
ప్రముఖ బాలీవుడ్ గాయకుడూ ఆడమ్ సమీ ఈ సందర్భంగా జగన్ ట్వీట్ కి రిప్లై ఇస్తూ ‘ఈ ప్రాంతీయత భావం ఎందుకు..దేశానికీ అవార్డు వచ్చినట్టు చెప్పొచ్చు కదా..ఒక సీఎం హోదాలో ఉన్న మీ నుండి ఇలాంటి ట్వీట్ చూడాల్సి వచ్చినందుకు సిగ్గు పడుతున్నాను’అంటూ అదాన్ సమీ ట్వీట్ వేసాడు.దీనికి మన టాలీవుడ్ ఆడియన్స్ నుండి చాలా ఘోరమైన ట్రోలింగ్ వచ్చింది.
తెలుగు వాడిగా గర్వపడడం లో తప్పేమి ఉంది, మీ బాలీవుడ్ నుండి ఇలాంటి ట్వీట్ వస్తే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావా అంటూ అదాన్ సమీ పై విరుచుకుపడుతున్నారు.ఇది ఇలా ఉండగా అదాన్ సమీ తెలుగులో దాదాపుగా 30 కి పైగా పాటలను పాడాడు.బాలీవుడ్ లో టాప్ మోస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకున్న ఈయన తెలుగు పాడిన పాటలన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి.