Homeఎంటర్టైన్మెంట్NTR And Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ లో పౌరాణికం టచ్..? అసలు...

NTR And Prashanth Neel: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ లో పౌరాణికం టచ్..? అసలు ఇదెలా సాధ్యం!

NTR And Prashanth Neel: ఎన్టీఆర్(Junior NTR), ప్రశాంత్ నీల్(Prashanth Neel) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్'(Dragon Movie) చిత్రం పై రోజురోజుకి అంచనాలు భారీ రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఒక్క ప్రమోషనల్ కంటెంట్ కూడా బయటకు రాలేదు, అయినప్పటికీ కూడా ఈ సినిమాకు క్రేజ్ పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం జోర్డాన్ లో ఒక భారీ షెడ్యూల్ ని మొదలు పెట్టారు. ఈ షెడ్యూల్ లో మూడు భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అందులో టోనీవో థామస్, ఎన్టీఆర్ మధ్య వచ్చే భారీ ఫైట్ సీన్ కూడా ఉంటుందని టాక్. డ్రగ్స్ కార్టల్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన అత్యధిక శాతం షూటింగ్ సరిహద్దు ప్రాంతాల్లోనే జరుగుతాయని టాక్. ఈ షెడ్యూల్ కి ముందు అడవి లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను కూడా చిత్రీకరించారట మేకర్స్.

ఇదంతా పక్కన పెడితే, ఈ సినిమా యదార్ధ సంఘటనలను ఆధారంగా తీసుకొని తెరకెక్కిస్తున్నారని టాక్. అంటే నిజ జీవితం లో మనం చూస్తూ పెరిగిన కొన్ని క్యారెక్టర్స్ ని ఈ చిత్రం లో చూడొచ్చట. అందులో కొన్ని రాజకీయ పాత్రలు కూడా ఉంటాయని టాక్. అయితే వాటితో పాటు పౌరాణికం టచ్ కూడా ఈ చిత్రం లో ఉంటుందని సమాచారం. అంతే ‘కల్కి’ చిత్రం తరహాలో మహాభారతం లోని కొన్ని సంఘటనలు, అదే విధంగా క్లైమాక్స్ లో ప్రభాస్ ని కర్ణుడిగా చూపించడం వంటివి అప్పట్లో ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించాయి. మళ్లీ అలాంటి ప్రయోగాన్ని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ లో కూడా చేయబోతున్నట్టు సమాచారం. పౌరాణికం పాత్రల్లో ఎన్టీఆర్ ని మించిన నటుడు ఈ జనరేషన్ లో మన టాలీవుడ్ లో మరో హీరో లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనతో ఒక గెటప్ వేయించాలి అనుకోవడం మంచి ఆలోచనే.

కానీ ప్రశాంత్ నీల్ జానర్ సినిమాలకు అది ఎంత మాత్రం సూట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అతికించినట్టు అసలు ఉండకూడదు. అలా ఉంటే చాలా పెద్ద దెబ్బ ఎదురుకోవాల్సి ఉంటుంది. గతం లో ఇదే సినిమాలో దేశభక్తి కి సంబంధించిన ఒక పాట చిత్రీకరణ కూడా జరిగిందని చెప్తున్నారు. దీనిని బట్టీ చూస్తే ఇది రెగ్యులర్ ప్రశాంత్ నీల్ ఫార్ములా సినిమా కాదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈ కొత్త ప్రయోగం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మే వరకు ఆగాల్సిందే. ఎందుకంటే అప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు కాబట్టి, మూవీ టీం ఒక టీజర్ ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version