Lokesh Kanakaraj- Prabhas: విక్రమ్ సక్సెస్ తో లోకేష్ కనకరాజ్ పేరు సౌత్ ఇండియాను ఊపేస్తోంది. స్టార్స్ ఆయనతో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా లియో తెరకెక్కిస్తున్నారు. విజయ్ బర్త్ డే కానుకగా ఓ సాంగ్ విడుదల చేశారు. త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. లియో అక్టోబర్ 19న దసరా కానుకగా విడుదల కానుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూవీ చేస్తున్నారంటూ పలువురు స్టార్ హీరోల పేర్లు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ పేరు వినిపించింది.
అనూహ్యంగా లోకేష్ కనకరాజ్ ప్రభాస్ తో మూవీ ప్రకటించారు. ఆయన లేటెస్ట్ కామెంట్స్ చిత్ర వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. కోలీవుడ్ మీడియా సమాచారం మేరకు… లోకేష్ కనకరాజ్ మాట్లాడుతూ ప్రభాస్ తో నేను చేసే మూవీ మా ఇద్దరి కెరీర్లోనే భారీ బడ్జెట్ చిత్రం అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ లియో మూవీ అనంతరం మొదలవుతుందని అన్నారు. అంటే ప్రభాస్ తో చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ అధికారికంగా ప్రకటించినట్లు అయ్యింది.
ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే, రాజా డీలక్స్ చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు. సలార్ షూటింగ్ చివరి దశకు చేరింది. సెప్టెంబర్ 28న విడుదల కానుంది. ఇక ప్రాజెక్ట్ కే 2024 సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాజా డీలక్స్ షూటింగ్ మొదలైంది. ఈ ప్రాజెక్ట్ పై స్పష్టమైన సమాచారం లేదు. కాగా అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ టైటిల్ తో ఒక మూవీ ప్రకటించారు. ఒకవేళ నిజంగా లోకేష్ కనకరాజ్ మూవీ సాకారం అయితే ఎప్పుడు పట్టాలెక్కుతుందనేది… చూడాలి.
ప్రభాస్ లేటెస్ట్ రిలీజ్ ఆదిపురుష్ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ పర్లేదు అన్నట్లు ఉన్నాయి. తెలుగు, హిందీ, ఓవర్సీస్లో వసూళ్లు బాగున్నాయి. తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఆదిపురుష్ చిత్రానికి కనీస ఆదరణ దక్కలేదు. ఆదిపురుష్ నాలుగు వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. చిత్ర బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్ రీత్యా ఇంకా వసూలు చేయాల్సి ఉంది.