Thaman Dance For Bheemla Nayak Song: పవర్ స్టార్ పవన్ పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనంగా కలెక్షన్స్ ను రాబడుతుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ భీమ్లానాయక్ సినిమా చూస్తూ రచ్చ చేశాడు. థియేటర్‌లో ‘లాలా భీమ్లా..’ పాట రాగానే.. స్క్రీన్ దగ్గరకు వెళ్లి స్టెప్పులు వేశాడు. డ్రమ్ స్పెషలిస్ట్ శివమణి, సింగర్ రేవంత్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు.

పైగా ‘ఇది నా లీడర్ పవన్ కల్యాణ్, నా జీనియస్ త్రివిక్రమ్ కోసం. మీ అందరికీ నచ్చిందనుకుంటా’ అని ట్వీట్ చేశాడు తమన్. అన్నట్టు భీమ్లానాయక్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళ భామ సంయుక్త మీనన్ కు మంచి అవకాశాలు వస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ హీరోయిన్ కోసం పలువురు టాలీవుడ్ మేకర్స్ ఆమెను కాంటాక్ట్ చేసినట్లు సమాచారం.

Also Read: ఏపీలో భీమ్లానాయక్ షో వేయలేక థియేటర్ల మూసివేత.. అసలు కారణాలు ఇవే
2016లో మలయాళ సినిమాల్లోకి వచ్చిన ఈ సుందరి.. అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్లింది. కన్నడ, తమిళంలోనూ సినిమాలు చేస్తోంది. మరోపక్క భీమ్లానాయక్ కలెక్షన్లలో దూసుకెళ్తోంది. మొదటి రోజు నైజాంలో రూ.11.85 కోట్ల షేర్ వచ్చింది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అంతకుముందు ఈ రికార్డు పుష్ప పేరిట ఉండేది. పుష్పకి రూ.11.44 కోట్లు వచ్చాయి, దాన్ని భీమ్లానాయక్ బ్రేక్ చేసింది. ఆ తర్వాత సాహో (రూ.9.41 కోట్లు), బాహుబలి-2 (రూ.8.9 కోట్లు), వకీల్ సాబ్ (రూ.8.75 కోట్లు) ఉన్నాయి. మరోవైపు ఏపీలో టికెట్ రేట్లు తగ్గడంతో అక్కడ కలెక్షన్లు నెమ్మదించాయి.
Also Read: భీమ్లా నాయక్ లో ఆ డైలాగ్ జగన్ ని ఉద్దేశించి పెట్టారట
Recommended Video:
[…] Also Read: Thaman Dance For Bheemla Nayak Song: నైజాంలో ‘భీమ్లా నాయక్’ … […]
[…] Also Read: నైజాంలో ‘భీమ్లా నాయక్’ సరికొత్త రికా… […]
[…] Tollywood Movie Time: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఏ మాయ చేసావే చిత్రం విడుదలై నేటితో 12ఏళ్లు గడుస్తున్న సందర్భంగా దీనిపై సమంత భావోద్వేగభరితంగా పోస్ట్ చేసింది. ‘లైట్స్, కెమెరా, యాక్షన్.. 12ఏళ్ల జ్ఞాపకాలు, అనుభవాలు గుర్తుకువస్తున్నాయి. ఈ ప్రయాణం, ప్రపంచంలోనే అత్యంత విధేయత ఉన్న అభిమానులను ఇచ్చినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.. అవి వేటికీ సరిపోలని క్షణాలు’ అని సమంత పేర్కొంది. […]