Mrunal Thakur: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లో ఒకరు మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). బుల్లితెర లో సీరియల్స్ ద్వారా కెరీర్ ని ప్రారంభించిన ఆమె, ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా అవకాశాలు నెమ్మదిగా సంపాదిస్తూ, హిట్టు మీద హిట్టు కొడుతూ పెద్ద రేంజ్ కి వెళ్ళిపోయింది. తెలుగు లో ఈమె ‘సీతారామం’ అనే చిత్రం ద్వారా మన ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక పక్క అందంతో, మరో పక్క నటన తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసేసింది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘హాయ్ నాన్న’ కూడా పెద్ద హిట్ అయ్యింది, కానీ ఆ తర్వాత వచ్చిన ‘ది ఫ్యామిలి స్టార్’ చిత్రం మాత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది.
ఇప్పుడు లేటెస్ట్ గా ఆమె అడివి శేష్ తో కలిసి ‘డెకాయిట్’ అనే చిత్రం చేసింది. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ లో విడుదల కాబోతుంది. ఇది కాసేపు పక్కన పెడితే హిందీ లో ఈమె ‘ధో దివానే షెహర్ మెయిన్’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా ఈనెల 20న విడుదల అవుతున్న సందర్భంగా మృణాల్ ఠాకూర్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటుంది. అందులో భాగంగా ఆమె ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూస్ లో మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి ఆమె చాలానే చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘సీరియల్స్ నుండి సినిమాల్లోకి వచ్చిన నాకు, హృతిక్ రోషన్ పక్కన సూపర్ 30 అనే చిత్రం లో నాకు హీరోయిన్ గా నటించే అవకాశం దక్కింది’.
‘ఈ విషయం తెలుసుకున్న నా బాయ్ ఫ్రెండ్ , హృతిక్ అందాన్ని చూసి చాలా కుళ్ళుకునేవాడు. పైగా మా షూటింగ్ స్పాట్ లో చాలామంది అందమైన అబ్బాయిలు ఉండేవారు. వాళ్లకు నేను ఎక్కడ పడిపోతాను అనే భయం తో, తాను కూడా అందంగా కనిపించాలని వర్కౌట్స్ చేసి 15 కేజీలు తగ్గిపోయి, హృతిక్ లాగా కండలు పెంచేసాడు. ఇది ఎప్పుడైతే నేను కనిపెట్టానో, అప్పటి నుండి అతను వర్కౌట్స్ ఆపేసి, బాగా తినడం మొదలు పెట్టి 20 కేజీలు పెరిగాడు. అసలు ఏమైంది నీకు అని అతన్ని అడగ్గా, అతను నాకు బ్రేకప్ చెప్పేశాడు’ అంటూ చెప్పుకొచ్చింది మృణాల్ ఠాకూర్. మరోపక్క ఈమె తమిళ హీరో ధనుష్ తో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.