Mr Bachchan: ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పై ఉండగానే మరో మూవీ ప్రకటించారు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడింది. మరో ఆరు నెలల వరకు పవన్ షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో మూవీ పూర్తి చేయాలని హరీష్ శంకర్ డిసైడ్ అయ్యారు. రవితేజతో ఆయన మూవీ కన్ఫర్మ్ చేయడంతో పాటు టైటిల్ పోస్టర్ కూడా విడుదల చేశారు.
హరీష్ శంకర్-రవితేజ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ నిర్ణయించారు. టైటిల్ చాలా క్యాచీగా ఉంది. రవితేజ అమితాబ్ బచ్చన్ వీరాభిమాని అన్న విషయం తెలిసిందే. డాన్ శ్రీను మూవీలో అమితాబ్ రెఫరెన్సెస్ లు బీభత్సంగా వాడాడు రవితేజ. మరోసారి ఆయన మీద ఈ రూపంలో అభిమానం చాటుకున్నాడు. ఏకంగా టైటిల్ తో అమితాబ్ సర్ నేమ్ వాడేశాడు.
ఇక లుక్ విషయానికి వస్తే… గాగుల్స్ పెట్టుకుని, స్కూటర్ పై కూర్చొని సూపర్ స్టైలిష్ గా ఉన్నాడు. గతంలో రవితేజ హీరోగా హరీష్ శంకర్ షాక్, మిరపకాయ్ చిత్రాలు తెరకెక్కించాడు. షాక్ డిజాస్టర్ కాగా… మిరపకాయ్ సూపర్ హిట్ కొట్టింది. మిరపకాయ్ మూవీలో రవితేజ క్యారెక్టర్ హరీష్ శంకర్ అద్భుతంగా డిజైన్ చేశాడు. ఏళ్ల అనంతరం రవితేజతో హరీష్ శంకర్ మూవీ చేస్తున్నాడు.
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్ర నిర్మాతగా ఉన్నాడు. ఇది రీమేక్ అని సమాచారం. హిందీ లో విజయం సాధించిన రైడ్ చిత్రాన్ని తెలుగులో మిస్టర్ బచ్చన్ గా తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. ఫస్ట్ లుక్ తోనే రవితేజ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాడు హరీష్ శంకర్. మూవీ సూపర్ హిట్ అవుతుందని వాళ్లకు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.