Box Office: అసలు … ఇదెక్కడి గొడవండి బాబు.. ఎక్కడైనా సినిమా టిక్కెట్లను ప్రభుత్వం అమ్ముకుంటుందా ? మరి ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఈ సినిమా టిక్కెట్ల గోల ఏమిటి ? అయినా అన్ని వస్తువుల రేట్ల పెంచి, ఒక్క సినిమా టికెట్ రేట్ల పైన మాత్రమే నియంత్రణ ఎందుకు ? ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకుంటే.. దేశంలో ఎక్కడా ఇలాంటి దరిద్రం లేదు. మరెక్కడా ఈ స్థాయి పైత్యం లేనే లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా సినీ, రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ ముమ్మరంగా సాగుతోంది.

జగన్ తీరు, ఏపీలో జరుగుతున్న వైనం మొత్తమ్మీద సమాధానం లేని ప్రశ్నలు రోజురోజుకూ ఎక్కువ అయిపోతున్నాయి. అయినా ఇప్పుడున్న సమాజంలో నిత్యావసర వస్తుల పై నియంత్రణ పెట్టాలి. అలాగే ముఖ్యంగా పెట్రో ధరలపై నియంత్రణ పెట్టాలి. కానీ, నియంత్రణ కేవలం సినిమా టిక్కెట్లపైనే ఎందుకు పెడుతున్నారు ?
ఈ విషయంలో సినిమా వాళ్ళు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే, ఎవరేమనుకున్నా తన నిర్ణయాన్ని మార్చుకోవడం జగన్ కి ఇష్టం ఉండదు. అందుకే, అధికార పార్టీ ఆలోచన ఏది అయినా.. ఒకసారి నిర్ణయం జరిగిపోయాక ఇక ఆ నిర్ణయం మారదు అంటూ మొత్తానికి జగన్ తనదైన శైలిలోనే ముందుకు పోతున్నాడు.
సినిమా టిక్కెట్ ధరను 100కు మాత్రమే జగన్ ఫిక్స్ చేశాడు. మరి ఈ రేటు పెద్ద సినిమాలకు వర్కౌట్ కాదు. ఇప్పటికే థియేటర్లలోకి వచ్చేందుకు పెద్ద సినిమాలు ఉత్సాహంగా ఉన్నాయి. మరి ఈ వేళ, ఏపీలో సినిమా టిక్కట్ల ధరల అంశం ఇంకా ఆరని దీపంలా కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది. మరి, యావత్ సినీ పరిశ్రమ ఇప్పుడు ఏమి చేస్తే జగన్ మనసు మారుతుంది ?
Also Read: Kgf 2 Movie: ఆ డేట్ కి క్రేజీ అప్డేట్ ను ఇవ్వనున్న… కేజీఎఫ్ 2 టీమ్
ఇంతకీ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు ఈ సినిమా టిక్కెట్ల విషయమై ఏం చేయబోతున్నాడు ? అయినా అక్రమబుద్ధి నైనా మార్చొచ్చు గానీ, వక్రబుద్ధిని మార్చగలరా ? ఏమి జరగబోతుందో ఎలా మార్చగలరో వేచి చూడాల్సిందే. ఒక్కటి మాత్రం క్లారిటీ ఉంది. మార్చి లేకపోతే ఎక్కువగా నష్టపోయేది భారీ సినిమాలే.
Also Read: Bigg Boss 5 Telugu: పదకండో వారం కెప్టెన్ ఎవరో తెలిసిపోయింది…