Age Gap Heros And Heroines: ఎంత ఘాటు ప్రేమయో ఇంత లేటు వయసులో అన్నారో సినీకవి. మన తెలుగు సినిమాల్లో కథానాయకులు ముదిరిపోయారు. తాతల వయసున్నా లేత వయసులో ఉన్న కథానాయికలతో నటిస్తూ మెప్పిస్తున్నారు. పాత తరం హీరోలే అయినా కుర్ర కథానాయకులకు ఏం తీసిపోకుండా తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాగార్జన పాత తరం హీరోలయినా కొత్త హీరోలకు సమానంగా తమ గ్లామర్ ను మెయింటెన్ చేస్తుండటం గమనార్హం. దీంతో వారి పక్కన నటించే హీరోయినట్లు మాత్రం లేత కొబ్బరికాయలాంటి వాళ్లు ఉంటున్నారు. దీంతో వయసులో తేడా భారీగానే ఉంటోంది. అయినా వారు లెక్కపెట్టడం లేదు.
గతంలో ఎన్టీఆర్ శ్రీదేవి మధ్య కూడా వయసులో ఎంతో తేడా ఉన్నా వారి జంట తెలుగు ప్రేక్షకులకు కనువిందు చేసింది. వారు వేసిన స్టెప్పులు అదిరే విధంగా ఉండటమే కారణం. ఈ నేపథ్యంలో అప్పటి హీరోలైనా ఇప్పటికి కూడా వారే తమ ప్రతిభతో రాణిస్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమను తమ గుప్పిట్లో పెట్టుకోవడం తెలిసిందే. ఈ నలుగురిలో వెంకటేశ్ మాత్రం మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. మిగతా ముగ్గురు హీరోలు మాత్రం వారి వారి స్టైల్లోనే ముందుకు పోతున్నారు.
వయసులో తేడాలు రావడంతో వారు మనవరాలు వయసు వీరేమో తాతల్లా కనిపిస్తున్నారు. ఎంత మేకప్ వేసినా వయసు మాత్రం దాయడం సాధ్యం కాదని తెలిసిందే. దీంతో వారి ముఖాల్లో వయసు ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అయినప్పటికి వారు మాత్రం తమ రూటు మార్చడం లేదు. వయసులో పెద్ద వారైన వారిని తీసుకోకుండా చిన్న వయసున్న వారితో జట్టు కడుతూ చిందులేస్తున్నారు. ఈ క్రమంలో హీరో హీరోయిన్ల మధ్య వయసు తేడాలు భారీగానే ఉంటున్నాయి.
Also Read: Varun Tej: ఇంటర్వ్యూ : వరుణ్ తేజ్ – ఎఫ్ 3 నవ్వుల పండగలా వుంటుంది.
ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో వయసు పెరిగిన వారే ఎక్కువగా ఉంటున్నా హీరోయిన్లు మాత్రం ఎక్కువ కాలం నిలవడం లేదు. మహా అయితే పదేళ్లు మాత్రమే వారికి అవకాశాలు వస్తున్నాయి. తరువాత వారికి అమ్మ, అత్తల పాత్రలు ఇష్తున్నారు. కానీ హీరోలు మాత్రం వారే కొనసాగుతూ హీరోయిన్లు మారుతున్నారు. అందుకే వారి మధ్య తరం గ్యాప్ వస్తోంది. హీరోల పక్కన వారు చిన్న పిల్లల్లా కనిపిస్తున్నారు. అయినా వారికి వేరే దిక్కు లేకపోవడంతో వారితోనే సర్దుకుపోవాల్సి వస్తోంది.
త్రిష, నయనతార, కాజల్ లాంటి వారు ఇప్పటికి తమ గ్లామర్ తో హీరోయిన్లుగా చేయాలనుకుంటున్నారు. కానీ కొత్త వారినే అవకాశాలు వరిస్తున్నాయి. దీంతో కొత్తగా వచ్చే వారిని పోటీని తట్టుకోలేక వారు నిష్ర్కమిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి తెలుగు సినిమా పరిశ్రమ తాతల నాటి హీరోలను పోషిస్తున్నా హీరోయిన్లను మాత్రం కొత్త వారినే తీసుకోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
Also Read:F3 Movie First Full Review: ఎఫ్ 3 మూవీ – హిట్టా ? ఫట్టా ?