https://oktelugu.com/

Karthika Deepam:  కార్తీక్ చేతిలో మోనిత బిడ్డ.. తండ్రి ఎత్తుకోవటంతో ఏడుపు ఆపినా బాబు!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. మోనిత తన బిడ్డ గురించి బాధపడుతుంది. ఎలాగైనా తన బిడ్డను వెతికి పట్టుకోవాలని అనుకుంటుంది. ఆదిత్య, శ్రావ్య వాళ్ళని చూసి కాఫీ కలపాలా అన్ని ఓవర్ చేయడంతో ఆదిత్య తనపై కోపంగా అరుస్తాడు. హిమ, సౌర్య బాబుతో ఆడుకుంటూ ఉండగా బాబు ఏడుస్తూ ఉంటాడు. శ్రీవల్లి ఎత్తుకున్న ఊరుకోడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఎత్తుకోవటం తో ఊరుకుంటాడు. పిల్లలు ఆశ్చర్యపోతారు. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 22, 2021 / 08:22 AM IST
    Follow us on

    Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమౌతున్న కార్తీకదీపం సీరియల్ లో ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. మోనిత తన బిడ్డ గురించి బాధపడుతుంది. ఎలాగైనా తన బిడ్డను వెతికి పట్టుకోవాలని అనుకుంటుంది. ఆదిత్య, శ్రావ్య వాళ్ళని చూసి కాఫీ కలపాలా అన్ని ఓవర్ చేయడంతో ఆదిత్య తనపై కోపంగా అరుస్తాడు. హిమ, సౌర్య బాబుతో ఆడుకుంటూ ఉండగా బాబు ఏడుస్తూ ఉంటాడు.

    Karthika Deepam

    శ్రీవల్లి ఎత్తుకున్న ఊరుకోడు. అప్పుడే కార్తీక్ వచ్చి ఎత్తుకోవటం తో ఊరుకుంటాడు. పిల్లలు ఆశ్చర్యపోతారు. కోటేష్ బాబును తీసుకొని శ్రీవల్లితో హాస్పిటల్ కి బయలుదేరుతాడు. దారి మధ్యలో వాళ్లకు రుద్రాణి కనిపించడంతో పట్టించుకోకుండా. తీసుకోకుండా వెళ్తారు. రుద్రాణి వాళ్లను పిలిచి వారిపై కాసేపు అరిచి బాబు ని చూస్తుంది. ముద్దుగా ఉన్నాడని అని బాబు చుట్టూ డబ్బులు తిప్పి ఓ వ్యక్తికి ఇస్తుంది.

    Also Read: హీనంగా మారిన వంటలక్క పరిస్థితి.. మరీ ఇంత దారుణమా!

    మరోవైపు దీప ఒంటరిగా నడుచుకుంటూ తాను రుద్రాణి కొట్టిన విషయాన్ని తలుచుకుంటూ వస్తుంది. ఇక తను బంగారం తాకట్టు పెట్టిన విషయంను చెప్పకుండా జాగ్రత్త పడాలని చూస్తుంది. కార్తీక్ కూడా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ గత విషయాలు తలచుకుంటూ బాధ పడుతాడు. వెనకాల నుండి ఓ వ్యక్తి డాక్టర్ బాబు అని పిలుచుకుంటూ రావడంతో కార్తీక్ షాక్ అవుతాడు. కానీ అతడు మరో డాక్టర్ దగ్గరికి మందులు అడుగుతాడు.

    ఇక డాక్టర్ ప్రవర్తన చూసి కార్తీక్ కు కోపం వస్తుంది. సౌందర్య వారణాసితో కార్తీక్, దీప ఎలా ఉన్నారు, పిల్లలు ఎలా ఉన్నారో చెప్పమని చెబుతుంది. నీకు ఫోన్ చేశారని, మాట్లాడారని చెప్పు వారణాసి అంటూ బతిమాలుతోంది. అప్పుడే మోనిత వచ్చి పెద్ద కోడలు గురించి బాగా ఆలోచిస్తున్నావ్ అంటూ.. నా బాబు ని కూడా దూరం చేసుకున్నాను అని వాడిని కూడా కొంచెం పట్టించుకోండి అంటూ సౌందర్య తో అంటుంది. ఇక సౌందర్య మోనితపై గట్టిగా అరుస్తుంది.

    Also Read: మోనిత ఫోటో ఫ్రేమ్ ను పగలకొట్టిన సౌందర్య.. రుద్రాణి మాటలకు ఒప్పందం తీసుకున్న కార్తీక్!