Mokshagna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ రైటర్ గా ఒక ప్రత్యేక ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని తెలుగులో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో కథ మాటలు ఇచ్చినందుకు మొదటి సారి కోటి రూపాయలు తీసుకున్న రైటర్ గా మంచి గుర్తింపు పొందిన రైటర్ త్రివిక్రమ్ శ్రీనివాస్… ఆ తర్వాత ఈయన డైరెక్టర్ గా మారి వరుసగా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకున్నాడు.
ఆయన చేసిన సినిమాల్లో కొన్ని సినిమాలు ఇండస్ట్రీ హిట్లు గా కూడా నిలిచాయి…అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ చాలా బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మహేష్ బాబు తో చేస్తున్న గుంటూరు కారం సినిమా తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అలాగే ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయబోతున్నాడు ఇలాంటి సమయంలో ఆయన రాసుకున్న ఒక కథ తను డైరెక్షన్ చేసే ఛాన్స్ లేకపోవడంతో తన దగ్గర అసోసియేట్ గా చేస్తున్న ఒక అబ్బాయిని డైరెక్టర్ గా పరిచయం చేయాలనే ఉద్దేశ్యం తో ఆయన సీతార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద ఆ కొత్త అబ్బాయి ని డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాడు. ఇక దానికి కథ మాటలు త్రివిక్రమ్ అందిస్తున్నాడు.
అయితే రీసెంట్ గా ఈ స్టోరీని బాలయ్య బాబుకు చెప్పినట్టుగా తెలుస్తుంది. వాళ్ళ అబ్బాయిని ఎప్పటినుంచో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నప్పటికీ మంచి కథ అయితే దొరకడం లేదు. దాంతో త్రివిక్రమ్ చెప్పిన కథకు బాలయ్య బాబు ఓకే చెప్పినట్టు గా తెలుస్తుంది. అందుకే ఈ సినిమా తో బాలయ్య బాబు తన కొడుకైన మోక్షజ్ఞని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చూస్తున్నాడు. అందుకే త్రివిక్రమ్ చేతిలో తన కొడుకుని పెట్టి మొదటి సినిమా సక్సెస్ బాధ్యత మొత్తాన్ని త్రివిక్రమ్ కే అప్పజెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక గుంటూరు కారం సినిమా అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ అటు ఆయన సినిమా చేసుకుంటూనే ఇటు మోక్షజ్ఞతో కొత్త డైరెక్టర్ చేసే సినిమా మీద కూడా ఒక కన్ను వేసి ఉంచబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా సక్సెస్ అయితే త్రివిక్రమ్ భారీ లాభాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కథ మాటలు ఇచ్చేది తనే కాబట్టి దానికి డబ్బులు వస్తాయి. అలాగే ప్రొడక్షన్ లో కూడా త్రివిక్రమ్ కి కొంత వాటా ఉంది కాబట్టి అటు ప్రొడక్షన్ పరంగా, ఇటు రైటింగ్ పరంగా చాలా డబ్బులు కూడా సంపాదిస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక త్రివిక్రమ్ స్టోరీ తో బాలయ్య తన కొడుకుని లాంచ్ చేస్తున్నాడు మరి మోక్షజ్ఞ ఈ సినిమాతో హీరో గా ఏ రేంజ్ లో రాణిస్తాడో తెలియాల్సి ఉంది…