Homeఎంటర్టైన్మెంట్Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి చేతిలోనే.. !

Nandamuri Mokshagna: మోక్షజ్ఞ ఎంట్రీ బోయపాటి చేతిలోనే.. !

Nandamuri Mokshagna: నందమూరి బాలకృష్ణ సినీ వారసుడిగా మోక్షజ్ఞ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా ? అని ఆశగా ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. అయితే, మోక్షజ్ఞ ఎంట్రీ పై ఒక ఎక్స్ క్లూజివ్ అప్ డేట్ ఏమిటంటే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా ఉంటుందట. ఇప్పటికే కథ కూడా ఫైనల్ అయిందని, రచయిత ఎం రత్నం.. మోక్షజ్ఞ కోసం ఓ పవర్ ఫుల్ కథ రాశాడని తెలుస్తోంది. కాకపోతే, ఈ సినిమా మరో ఏడాది తర్వాతే మొదలవుతుంది.

Nandamuri Mokshagna
Nandamuri Mokshagna

ప్రస్తుతం బోయపాటి తన తర్వాత చిత్రాన్ని అల్లు అర్జున్ తో ప్లాన్ చేశాడు. ఆ సినిమా తర్వాత మోక్షజ్ఞతో ఓ భారీ యాక్షన్ సినిమా చేస్తాడట. అన్నట్టు ఈ సినిమాలో బాలయ్య కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రంలో రెండు నేపథ్యాలు ఉండబోతున్నాయని.. చారిత్రకంతో పాటు ఐరోపా నేపథ్యాన్ని కూడా సినిమాలో చూపిస్తారని తెలుస్తోంది.

ముఖ్యంగా మోక్షజ్ఞ పాత్ర చాలా వినూత్నంగా ఉండబోతుందట. అయితే, మొదటి సినిమాలోనే విభిన్న పాత్రలో కనిపించడం ఒకవిధంగా రిస్క్. అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. ఎందుకంటే.. బాలయ్య అభిమానులకు ఎక్కువుగా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు మాత్రమే నచ్చుతాయి. బాలయ్య అభిమానులు పక్కా మాస్ ఆడియన్స్.

మరి వారికీ నచ్చే విధంగా సినిమా చేయాలి అంటే.. ఆ కొత్తదనంలో బోయపాటి మార్క్ కూడా ఉండాలి. అందుకే, బోయపాటికి తన కొడుకు ఎంట్రీని అప్పగించాడు బాలయ్య. ఇక మోక్షజ్ఞ బాగా కష్టపడుతున్నాడు. హీరో అయ్యే దిశగా మోక్షజ్ఞ భారీ కసరత్తు చేస్తున్నాడు. అయితే, ‘ఆదిత్య 369’ సీక్వెల్ తోనే మోక్షజ్ఞ ఎంట్రీ అని ఆ మధ్య బాగా టాక్ నడిచింది.

పైగా మోక్షజ్ఞ తెరంగేట్రం చేయడానికి ‘ఆదిత్య 369’ సీక్వెల్ పర్ఫెక్ట్ అంటూ నందమూరి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఉన్నట్టు ఉండి.. ‘ఆదిత్య 369’ సీక్వెల్ ప్లేస్ లోకి బోయపాటి సినిమా రావడం అనేది విశేషమే.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version