Mohanlal Dadasaheb Phalke Award: మలయాళం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు మోహన్ లాల్ ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. కంప్లీట్ యాక్టర్ గా తనకు ఒక బిరుదైతే ఉంది. ఏ పాత్రనైనా సరే ఒప్పుకుంటే అందులో పరకాయ ప్రవేశం చేసి కంప్లీట్ గా ఆ పాత్రకు న్యాయం చేయగలిగే కెపాసిటి ఉన్న నటుడు కావడం వల్ల అతను చాలా గొప్ప పాత్రలనైతే చేశాడు…ఈరోజు కేంద్ర ప్రభుత్వం అతనికి ‘ దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందిస్తున్నట్టుగా ప్రకటించింది…నటుడిగా, దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా గత 47 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీ కి తన సేవలను అందిస్తూ సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా తక్కువ మంది గొప్ప నటులలో మోహన్ లాల్ కూడా ఒకరు కావడం విశేషం…ఇక సెప్టెంబర్ 23వ తేదీన 71వ నేషనల్ ఫిలిం అవార్డు ప్రధానోత్సవంలో మోహన్ లాల్ కి ఈ అవార్డు అందించబోతున్నారు… ఇక మోహన్ లాల్ తన ఎంటైర్ కెరియర్ లో ఇప్పటివరకు 6 నేషనల్ అవార్డ్స్ ని అందుకున్నాడు. ఇప్పటివరకు సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన ఏజ్ గ్రూపులో ఉన్న ఆర్టిస్టులు ఎవరికి సాధ్యం కానీ రీతిలో అవార్డులను అందుకోవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ లో నేషనల్ అవార్డ్ ఒక్కసారి వస్తే చాలు అనుకుంటారు.
కానీ మోహన్ లాల్ మాత్రం ఇప్పటివరకు ఆరుసార్లు ఆ అవార్డు ను కైవసం చేసుకున్నారు అంటే ఆయన నటన ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు…2023వ సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా మోహన్ లాల్ ప్రకటించిన తర్వాత మన దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ సైతం మోహన్ లాల్ కు అభినందనలు తెలుపుతూ అతనితో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
నటన విషయం లో మోహన్ లాల్ చాలా గొప్ప ప్రయోగాలు చేశాడు అంటూ అతన్ని ప్రశంసించాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మోహన్ లాల్ చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు.
భారీ బడ్జెట్ సినిమాలను చేస్తూనే చిన్న బడ్జెట్ సినిమాలను కూడా చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం. మోహన్ లాల్ తన పాత్ర నచ్చితే ఎలాంటి సినిమాలోనైన నటించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసి చూపించాడు…
ശ്രീ മോഹൻലാൽ ജി പ്രതിഭയുടെയും അഭിനയ വൈവിധ്യത്തിന്റെയും പ്രതീകമാണ്. പതിറ്റാണ്ടുകൾ നീണ്ട സവിശേഷമായ കലാസപര്യയിലൂടെ, മലയാള സിനിമയിലും നാടകത്തിലും പ്രമുഖ വ്യക്തിത്വമായി നിലകൊള്ളുന്ന അദ്ദേഹത്തിന്, കേരള സംസ്കാരത്തിൽ തീവ്രമായ അഭിനിവേശമുണ്ട്.തെലുങ്ക്, തമിഴ്, കന്നഡ, ഹിന്ദി സിനിമകളിലും… https://t.co/4MWI1oFJsJ pic.twitter.com/MJp4z96RlV
— Narendra Modi (@narendramodi) September 20, 2025