Mohanlal In Chiranjeevi Film: మెగా అభిమానులు ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న సినిమా కావడం తో పాటు, మెగాస్టార్ చాలా కాలం తర్వాత పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా చేస్తుండడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించని రేంజ్ కి వెళ్ళింది. అంతే కాకుండా రీసెంట్ గా ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలు కూడా పెద్ద హిట్ అవ్వడం తో ఈ చిత్రం సక్సెస్ పై అభిమానుల్లో మరింత విశ్వాసం కలిగేలా చేసింది. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ మరోసారి డైరెక్టర్ బాబీ కొల్లి తో ఒక సినిమా చేయబోతున్నాడు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.
గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీ ఎంట్రీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నుండి ది బెస్ట్ చిత్రం వచ్చిందంటూ ఈ సినిమాని చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్స్ చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ ని ఇచ్చిన డైరెక్టర్ తో చిరు మరోసారి చేతులు కలపడం పై అభిమానులు ఎంతో సంతృప్తి తో ఉన్నారు. ఇకపోతే ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ పాత్ర ని మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ పోషించబోతున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గానే డైరెక్టర్ బాబీ మోహన్ లాల్ ని కలిసి ఈ సినిమా స్టోరీని వినిపించి, తన పాత్ర గురించి కూడా వివరించాడట. మోహన్ లాల్ కి తెగ నచ్చడం తో వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.
అంతే కాదు ఈ చిత్రం లో చిరంజీవి కి కూతురు గా, లేటెస్ట్ జనరేషన్ కి సంబంధించిన ఒక యంగ్ హీరోయిన్ ని తీసుకోబోతున్నారట. అది శ్రీలీల కావొచ్చు, భాగ్యశ్రీ భొర్సే కావొచ్చు, ఎవరు ఏమిటి అనే దానిపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. కూతురికి తండ్రి పాత్ర అంటే, వయస్సుకి తగ్గ పాత్ర నే చిరంజీవి చేస్తున్నాడని అభిమానులకు అర్థం అయ్యింది. ఆయన నుండి కోరుకునేది ఇలాంటి పాత్రలే అని, ఈ వయస్సులో కూడా కుర్రాడి లాగా నటించడం చిరంజీవి కి సూట్ అవ్వడం లేదని, ఆయన రీ ఎంట్రీ ఇచినప్పటి నుండి అభిమానులు మొత్తుకుంటూనే ఉన్నారు. చివరికి ఇలా సెట్ అయ్యింది అన్నమాట, చూడాలి మరి రాబోయే రోజుల్లో ఇదే దారిలో కొనసాగుతాడా లేదా అనేది.