Mohan Babu : మంచు కుటుంబం గత రెండు మూడు నెలలుగా మీడియా లో ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో మనమంతా గమనిస్తూనే ఉన్నాం. కుటుంబ వివాదాలు, ఒకరి మీద ఒకరు కేసు వేసుకోవడం, మీడియా ముందుకొచ్చి మాట్లాడడం వంటివి బిగ్ బాస్ రియాలిటీ షో ని తలపించాయి. అయితే ఈ క్రమం లో మోహన్ బాబు ఇంటికి వచ్చిన మీడియా పై ఆయన మైక్ లాక్కొని దాడి చేయడం, ఆ రిపోర్టర్ ఇప్పటికీ హాస్పిటల్ లో చికిత్స అందుకుంటూ ఉండడం వంటివి మనం తరచూ చూస్తూనే ఉన్నాం. మోహన్ బాబు(mohan babu) పై ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మోహన్ బాబు బౌన్సర్లు తిరుపతి లో వీరంగం సృష్టించారు. వాళ్ళు చేసిన ఓవర్ యాక్షన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. నెటిజెన్స్ ఈ తీరుపై తీవ్రమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబు యూనివర్సిటీ(Mohan Babu University) కి సమీపం లో ఉన్న ఒక రెస్టారెంట్ ధ్వంసం కి గురైన ఘటన పెను దుమారం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ కెమెరా ఫుటేజీ ని గమనించగా, యూనివర్సిటీ కి చెందిన పీఆర్వో తో పాటు బాడీగార్డ్స్ కూడా ఆ ఫుటేజీ లో ఉన్నారు. ఈ ఘటనపై సమీప ప్రాంతంలో ఉన్న జనాలను అడిగి తెలుసుకోగా, ఇంతకు ముందు ఈ రెస్టారంట్ లో ఉన్న సతీష్ వేరు, ఇప్పుడున్న సతీష్ వేరు అంటూ బౌన్సర్లు దౌర్జన్యానికి పాల్పడ్డారని చెప్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. లైవ్ లొకేషన్ నుండి రికార్డు చేయబడ్డ వీడియోలను మీ కోసం క్రింద అందిస్తున్నాము చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపం లో తెలియచేయండి. సోషల్ మీడియా లో నెటిజెన్స్ అయితే మోహన్ బాబు తీరుపై తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఏదైనా ఆ రెస్టారంట్ తో సమస్య ఉంటే, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పరిష్కరించుకోవాలి కానీ, ఇలా దాడి చేయడం ప్రజాస్వామ్య పద్దతి కాదని, మాటికొస్తే పద్దతి, క్రమశిక్షణ అంటూ క్లాస్ పీకే మోహన్ బాబు నుండి ఇలాంటివి ఊహించలేదని అంటున్నారు. అయితే ఇప్పుడు యూనివర్సిటీ ని మొత్తం మంచు విష్ణు(Manchu vishnu) నే మ్యానేజ్ చేస్తున్నాడు. మోహన్ బాబు మ్యానేజ్ చేసే రోజుల్లో ఇలాంటి ఘటనలు జరిగినట్టు మనం వినలేదు. మంచు విష్ణు ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఘటనలు జరగలేదు, ఇదే తొలిసారి. కచ్చితంగా ఆ రెస్టారంట్ లో ఎదో తప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయని, విద్యార్థులను అవి చెడిపేసే లాగా ఉన్నాయని, అందుకే విష్ణు ఇలాంటి యాక్షన్ తీసుకొని ఉండొచ్చు అంటూ మరికొంతమంది సపోర్టుగా ట్వీట్లు వేస్తున్నారు. రెస్టారంట్ వాళ్ళు తప్పు చేసినప్పటికీ కూడా దండించడానికి మోహన్ బాబు కి కానీ, విష్ణు కి కానీ ఎలాంటి అధికారం లేదు అనేది వాస్తవం.
మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు – రెస్టారెంట్ ధ్వంసం
మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్ ధ్వంసం జరిగిన ఘటనకు MBU యూనివర్సిటీ P.R.O సతీష్, యూనివర్సిటీ బాడీగార్డ్స్ సంబంధం ఉన్నట్లు సీసీ కెమెరా ఫుటేజ్‌లో కనిపిస్తోంది.
ఈ ఘటనలో ఇంతకు ముందు ఉన్న సతీష్ వేరు,… pic.twitter.com/gdDd6s9kFB
— Aadhan Telugu (@AadhanTelugu) February 14, 2025