spot_img
Homeఎంటర్టైన్మెంట్మే 10 తర్వాత నీ సంగతి చెబుతా పవన్: మోహన్ బాబు

మే 10 తర్వాత నీ సంగతి చెబుతా పవన్: మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పై పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా మంచు మోహన్‌ బాబు పవన్ కామెంట్స్ పై స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియా ద్వారా ఓ మెసేజ్ పోస్ట్ చేశారు. ‘నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్‌ కల్యాణ్‌ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతో సంభోదించాను. పవన్‌ కల్యాణ్‌గారు అనడంతో కూడా తప్పేమీలేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్‌. సంతోషమే.

Mohan Babu Reacts to Pawan Kalyan Attack

ఇప్పుడు ‘మా’ ఎలక్షన్స్‌ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్‌ 10వ తేదిన ఎలక్షన్స్‌ అయిపోతాయి. ఆ తర్వాత నువ్వు అడిగిన ప్రతి మాటకు నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈలోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి, అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను’అని మోహన్‌ బాబు ట్వీట్‌ చేశాడు.

మరి పవన్ కళ్యాణ్.. మోహన్ బాబు ట్వీట్ పై ఎలా స్పందిస్తారో చూడాలి. మరోపక్క ఏపీ ప్రభుత్వం పై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇస్తూ పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా మాకు ఒక్కటే అంటూ షాకింగ్ కామెంట్స్ చేయగా..

మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా ‘నోరుందని పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడాడు’ అంటూ పవన్‌ చేసిన వ్యాఖ్యల పై విమర్శలు చేశారు. ఇంకా పవన్ పై విమర్శలు చేయడానికి వైసీపీ నేతలు సన్నద్ధం అవుతున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్.. పవన్ సినిమాలకు నష్టం చేకూర్చేలా ఉన్నాయని సినీ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper
Exit mobile version