Mohan Babu : మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు విష్ణు(Manchu Vishnu) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరుపతి లో మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద ధర్నా చేస్తున్న SFI సంఘం వాళ్ళను కిడ్నాప్ చేయించారని మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీష్ లపై తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. రీసెంట్ గానే రేణుగుంట విమానాశ్రయం లో పోలీసులు సతీష్ ని అదుపులోకి తీసుకున్నారు. మరి ఇప్పుడు మోహన్ బాబు, మంచు విష్ణులను కూడా అదుపులోకి తీసుకుంటారో లేదో చూడాలి. పూర్తి వివరాల్లోకి వెళ్తే మోహన్ బాబు యూనివర్సిటీ లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చాలా కాలం నుండి ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు చిన్న తనయుడు మంచు మనోజ్ కూడా ఈ విషయం పై పెద్ద పోరాటమే చేసాడు. కొట్లాట వరకు వెళ్లి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
అయితే రీసెంట్ SFI సంఘాలు కూడా మోహబ్ బాబు యూనివర్సిటీ ఎదుట ధర్నాలు చేయడం మొదలు పెట్టాయి. విద్యార్థుల నుండి అన్యాయంగా అధిక ఫీజులు వసూలు చేసారని, తక్షణమే వాళ్లకు ఆ ఫీజులను తిరిగి చెల్లించాలని SFI నేతలు డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహించిన మోహన్ బాబు తన బౌన్సర్ల చేత వాళ్ళను కిడ్నాప్ చేయించినట్టు తెలుస్తోంది. కారులో వచ్చిన మోహన్ బాబు బౌన్సర్లు సినీ ఫక్కీలో విద్యార్థుల సంఘాల నేతలను ఎక్కించుకొని, మోహన్ బాబు ఫామ్ హౌస్ లో బంధించారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే మోహన్ బాబు ఫామ్ హౌస్ కి వెళ్లి విద్యార్థుల సంఘం నేతలను విడిపించి బౌన్సర్లను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అయినప్పటికీ ఈ వ్యవహారం పై మోహన్ బాబు ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు.
విద్యార్థుల నుండి అక్రమంగా వసూలు చేసిన అదనపు ఫీజులను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించినప్పటికీ మోహన్ బాబు పట్టించుకోకపోవడం తో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు.ఈ నేపథ్యం లో వాళ్ళ బాధను అర్థం చేసుకున్న SFI సంఘం, మరియు ఇతర విద్యార్థుల సంఘాలు యూనివర్సిటీ వద్ద ధర్నా చేపట్టి విద్యార్థుల బాధని మోహన్ బాబు కి అర్థం చేసే ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్లకు సర్దిచెప్పి పంపాల్సింది పోయి, అహంకారంతో ఇలా కిడ్నాప్ చేయడం అమానుషం అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.