Mohan Babu Comments On Rajinikanth: మోహన్ బాబు(Manchu Mohan Babu) కి ఆర్ధిక కష్టాలా..?, సినిమాల్లో లెజెండ్, విద్యానికేతన్ లాంటి విశ్వ విద్యాలయానికి అధినేత, నెలకు కోట్లలో సంపాదన, అలాంటి వ్యక్తికీ ఆర్ధిక కష్టాలేంటి? అని హెడ్ లైన్ చూడగానే మీరందరు ఆశ్చర్యపోయారు కదూ. ఆ హెడ్ లైన్ లో ఎలాంటి అబద్దం లేదు, రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మోహన్ బాబు నుండి వచ్చిన మాటలే ఇవి. అలాంటి సమయం లో ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మోహన్ బాబు వద్దకు వచ్చి, 45 లక్షల రూపాయిలు ఇచ్చి వెళ్ళాడట. ఈ విషయాన్నీ చెప్పుకొని మోహన్ బాబు చాలా ఎమోషనల్ అయిపోయాడు. అయితే ఈ ఘటన రీసెంట్ గా జరిగింది కాదు, చాలా ఏళ్ళ క్రితం జరిగిన సంఘటన. ఇంతకీ మోహన్ బాబు కి ఆర్థికంగా నష్టపోయేంతగా ఏమి జరిగింది?, ఆయనకు సాయం అందించిన ఆ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎవరు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం.
రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో మోహన్ బాబు మాట్లాడుతూ ‘అది 1995 వ సంవత్సరం. నేను హీరోగా నటించి, నిర్మాతగా వ్యవహరించిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో నేను తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చింది. ఈ విషయం ఎవరి ద్వారా నా ప్రాణ స్నేహితుడు సూపర్ స్టార్ రజినీకాంత్ కి, ఎవరి ద్వారా తెలిసిందో తెలియదు కానీ, వాడికి ఈ సమాచారం వెళ్ళింది. అప్పుడు నేను రాజమండ్రి లో ఉన్నాను. నేను అక్కడ ఉన్నాను అనే విషయం తెలుసుకొని, చెన్నై నుండి రాజమండ్రి కి వచ్చి, నన్ను తన కారులో ఎక్కించుకొని ఒక స్టార్ హోటల్ కి తీసుకెళ్లి, నా చేతిలో ఒక ప్యాకెట్ పెట్టాడు. ఆ ప్యాకెట్ ని తెరిచి చూస్తే అందులో 45 లక్షల రూపాయిల డబ్బు ఉంది’.
‘ఆ డబ్బు ని చూడగానే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను. సినిమాలు వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ అయ్యి నిరాశ లో ఉన్న నాకు, డబ్బు ఇవ్వడమే కాకుండా , తదుపరి చిత్రం ధైర్యం గా చేయడానికి నా గుండెల్లో బోలెడంత భరోసా ని నింపి వెళ్ళాడు. అలాంటి స్నేహితుడు దొరకడం నేను ఎన్నో జన్మలు చేసుకున్న పుణ్యం’ అంటూ మోహన్ బాబు చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇకపోతే చాలా కాలం తర్వాత మోహన్ బాబు ‘ప్యారడైజ్’ చిత్రం తో గ్రాండ్ గా టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో నేచురల్ స్టార్ నాని హీరో గా నటిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఈ సినిమా హిట్ అయితే మోహన్ బాబు కి ఈ జనరేషన్ ఆడియన్స్ ని అలరించే మరికొన్ని సంచలనాత్మక పాత్రలు భవిష్యత్తులో వస్తాయి.