Site icon OkTelugu

Bellamkonda Sai Srinivas Wedding Reception: బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి లో చిరంజీవి ని చూసి ముఖం చాటేసిన మోహన్ బాబు.. వీడియో వైరల్

Bellamkonda Sai Srinivas Wedding Reception

Bellamkonda Sai Srinivas Wedding Reception

Bellamkonda Sai Srinivas Wedding Reception: సినీ పరిశ్రమలో ఒక ఇద్దరి ప్రముఖుల మధ్య విబేధాలు ఉండడం సహజమే. సొంత కుటుంబం లోనే అభిప్రాయం భేదాలు ఎన్నో ఉంటాయి, అలాంటిది ఇంత పెద్ద ఇండస్ట్రీ లో ఆ మాత్రం విబేధాలు ఉండడం వింతేమీ కాదు. కానీ ఎన్ని విబేధాలు ఉన్నప్పటికీ ఒకరికొకరు ఎదురైనప్పుడు కనీసం పలకరించుకోవడం వంటివి ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంస్కృతి కి కూడా మన టాలీవుడ్ ప్రముఖులు దూరం అయ్యారు అనిపిస్తుంది. నేటి తరం స్టార్ హీరోల మధ్య ఇలాంటి విబేధాలు ఉన్నాయంటే పెద్ద ఆశ్చర్యం ఉండేది కాదు, దశాబ్దాల నుండి ఇండస్ట్రీ లో ఉన్నారు , ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించారు, అయినప్పటికీ కూడా ఒకరికొకరు ఎదురైనప్పుడు ముఖం చాటేసుకోవడం చిరంజీవి , మోహన్ బాబు విషయం లో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి కావ్య అనే అమ్మాయి తో తిరుమలలో బంధు మిత్రుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి . పెళ్ళికి మన టాలీవుడ్ కి సంబంధించిన ప్రముఖులు రాలేకపోయారు కానీ , నిన్న హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ కి మాత్రం అందరూ హాజరయ్యారు. ఈ రిసెప్షన్ కి చిరంజీవి , మోహన్ బాబు లతో పాటు అక్కినేని నాగార్జున , విక్టరీ వెంకటేష్ తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అయితే చిరంజీవి ఈ రిసెప్షన్ కి ముందుగా మోహన్ బాబు వచ్చి వధూవరులను ఆశీర్వదించగా , ఆ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవి వచ్చాడు. చిరంజీవి వస్తున్న సమయం లోనే మోహన్ బాబు కూడా ఎదురు పడ్డాడు.

కానీ చిరంజీవి ని పలకరించకుండానే ముఖం చాటేసి వెళ్ళిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ వీడియో లో బెల్లంకొండ శ్రీనివాస్ , అతని సతీమణి కావ్య, సోదరుడు బెల్లంకొండ గణేష్ లతో పాటు తండ్రి బెల్లంకొండ సురేష్ కూడా చిరంజీవి కాళ్ళు పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అక్కడికి ఎంతో మంది అతిధులు వచ్చారు , ఎవరికీ ఇలా బెల్లంకొండ సురేష్ కాళ్ళు మొక్కలేదు, అలాంటిది మెగాస్టార్ చిరంజీవి మొక్కాడు అంటే ఆయనపై ఏ స్థాయి గౌరవం ఉందో అర్థం అవుతుంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతే కాకుండా మోహన్ బాబు చిరంజీవి ని పలకరించకుండా వెళ్లిపోవడం గురించి కూడా సోషల్ మీడియా లో నెటిజెన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Exit mobile version