
Mohan Babu: మంచు ఫ్యామిలీ ‘మా’ అధ్యక్షుడు ప్రమాణ స్వీకారానికి ఒక వేదిక పెట్టుకుంది. సహజంగా ఆ వేదిక మీద నుంచి స్పీచ్ లు ఇవ్వడానికి మంచు హీరోలు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు ఒక భారీ స్పీచ్ రెడీ చేసుకున్నాడు. అయితే ఆ స్పీచ్ లో మెగా ఫ్యామిలీపై విమర్శలు చేశాడు మోహన్ బాబు.
మధ్యమధ్యలో తాను రాగద్వేషాలకు అతీతమైన వ్యక్తినంటూ కాసేపు తన గురించి రెండు బిల్డప్ మాటలు చెప్పుకుని.. పనిలోపనిగా మెగా ఫ్యామిలీలపై తనదైన స్టైల్‌లో విమర్శలు చేస్తూ విరుచుకుపడ్డారు. మోహన్ బాబు(Mohan Babu) ఉద్దేశ్యంలో మెగా కుటుంబంలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు కాబట్టి.. వాళ్ళు తమదే రాజ్యం అన్నట్టు ఉన్నారని.. కాబట్టి విరవీగొద్దని మోహన్ బాబు పరోక్ష హెచ్చరిక చేశాడు.
మళ్ళీ మధ్యలో తాను శాంతికి ప్రతీక అంటూ తన గురించి గొప్పగా చెపుకుంటూనే.. మరోవైపు మెగా కుటుంబం ఓవర్ యాక్షన్ చేస్తూ..బెదిరింపులకు పాల్పడిందని ఇన్ డైరెక్ట్ గా ప్రస్తావించారు. ఇక బెదిరింపులకు భయపడలేదని నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ.. స్మూత్ గా కామెంట్స్ చేశాడు.
మోహన్ బాబు మాటల్లోనే.. ‘మనం తెలియక ఏదేదో వాగుతూ విరవీగుతాం. ఏయ్ నేనెంత అని ఓవర్ యాక్షన్ చేస్తుంటాం. కానీ గంధర్వులు అన్నీ చూస్తుంటారు. కనురెప్ప వేయరు. మరుక్షణమే దిమ్మ తిరిగేట్టు కొడతారు జాగ్రత్త’ అంటూ అసలు సంబంధం లేకుండా మాట్లాడుతూ వెళ్ళాడు.
పైగా మోహన్ బాబు, మెగస్టార్ చిరంజీవి గురించి కూడా మాట్లాడుతూ.. మంచు విష్ణు బాబుని పోటీ నుంచి తప్పుకోమనండి అంటూ ఒకరు బెదిరించారిక్కడ. అయితే ఆ బెదిరింపులకు ఈ కళాకారులు భయపడరు. అసలు ఒకరి దయాదాక్షిణ్యాలు మాత్రమే ఇండస్ట్రీలో ఉండవు అని ఇప్పటికైనా వాళ్ళు తెలుసుకోవాలి. కేవలం ప్రతిభే ఇక్కడ నిలబెడుతుంది అని మోహన్ బాబు చెపుకుంటూ పోయారు.
అసలు మోహన్ బాబు దేని గురించి ఏం మాట్లాడుతున్నాడో అర్ధం కాకుండా ఏది పడితే అది మాట్లాడుతూ రెచ్చిపోవడం విచిత్రం. ఐతే మోహన్ బాబు స్పీచ్ లో ఒక మాట మాత్రం బాగుంది. క్రమశిక్షణగా ఉంటూ టాలెంట్‌ను అభివృద్ధి చేసుకుంటే సినిమా అవకాశాలు ఎందుకు ఉండవో చూద్దాం’ అని మోహన్ బాబు భరోసా ఇచ్చాడు. అయితే ఈ స్పీచ్ విన్న మురళీమోహన్ మెగా ఫ్యామిలీ పై మళ్ళీ ఈ కెలుకుడు ఎందుకయ్యా ? అని మోహన్ బాబుతో అన్నారట.