
Balakrishna: బాలయ్య బాబు.. నటనలో నట సింహం అయినా, బయట ఆయన మనసు మాత్రం వెన్నపూస. ఆయన గురించి తెలిసిన వారంతా చెప్పే మాట, నందమూరి బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం అని. ఆయన ఎప్పుడు ఓపెన్ గా ఉంటారని, ఆయన స్వచ్ఛమైన వ్యక్తిగా ఉంటారని.. ఇలా ఇండస్ట్రీలో బాలయ్య గురించి చెబుతూ ఉంటారు.
ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉన్నారని, సాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలిస్తే చాలు, వాళ్ళు తనను సాయం చేయమని అడగకపోయినా.. బాలయ్య వెంటనే వారికి సాయం చేస్తారని, ఆయనలో సేవా గుణం ఎక్కువ అని టాక్ ఉంది. ఇప్పుడు ఆ టాక్ నిజమే అంటూ మోహన్ బాబు ఇన్ డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చారు.
బాలయ్య(Balakrishna) వ్యక్తిత్వం గురించి మోహన్‌బాబు మాట్లాడుతూ.. బాలయ్య బాబు ఎంతో సంస్కారం ఉన్న వ్యక్తి అని చెప్పాడు. పైగా అందుకు ఒక ఉదాహరణ కూడా చెబుతూ… గత సాధారణ ఎన్నికల్లో మంగళగిరిలో బాలయ్య బాబు అల్లుడు నారా లోకేశ్ పోటీ చేశాడు. అయితే లోకేశ్ ఓటమి మెహన్ బాబు కోరుకున్నారు. ఆ సమయంలో లోకేశ్ పై కూడా అనేక విమర్శలు చేశారు.
అవి బాలయ్య దగ్గర వరకు వెళ్లాయి. కట్ చేస్తే.. మా’ ఎన్నికల్లో విష్ణు నిలబడ్డాడు. సాయం కోసం మద్దతు కోసం మంచు ఫ్యామిలీ బాలయ్యను కోరింది. కానీ, బాలయ్య పెద్ద మనసుతో జరిగినవి ఏవి మనసులో పెట్టుకోకుండా విష్ణుకి పబ్లిక్ గా మద్దతు ఇచ్చి మరీ గెలిపించాడు. పైగా ‘మా’ భవన నిర్మాణంలోనూ విష్ణుకి తోడుగా ఉంటానని బాలయ్య క్లారిటీ ఇచ్చాడు.
నిజానికి గెలవాలంటే మా మెంబర్స్ లో బాలయ్య మద్దతు చాలా అవసరం, ఎందుకంటే.. మా మెంబర్స్ లో బాలయ్య వర్గం ఎక్కువమంది ఉన్నారు. మొత్తానికి విష్ణు గెలుపుకి కారణం బాలయ్య కూడా. ఏది ఏమైనా తన అల్లుడు ఓటమికి కారణం అయినా ఫ్యామిలీ గెలుపు కోసం, బాలయ్య పని చేయడం నిజంగా గొప్ప విషయమే. బాలయ్య గొప్పతనానికి నిదర్శనమే
అయినా బాలయ్య బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఎప్పటికప్పుడు తన సేవను ప్రదర్శిస్తూనే ఉంటాడు. ఇప్పటికీ ఎంతో మందికి మేలు చేస్తూ తన పెద్ద మనసును చాటుకుంటూనే ఉన్నాడు. అందుకే బాలయ్య బాబు ఎప్పుడూ తోపే.