Pavitranath: మొగలి రేకులు నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి వార్త పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన అకాల మరణం పొందారు. పవిత్రనాథ్ మృతి వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నటులు ఇంద్రనీల్, మేఘన ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. పవిత్రనాథ్ మృతి వార్త అబద్ధం అయితే బాగుండు. ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపోతావని భావించలేదని వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. 2008లో ప్రారంభమైన మొగలిరేకులు సీరియల్ విశేష ఆదరణ పొందింది.
మొగలి రేకులు సీరియల్ లో హీరో ఆర్కే నాయుడు తమ్ముడు దయ పాత్ర చేశాడు పవిత్ర నాథ్. ఆ సీరియల్ ఏళ్ల తరబడి సక్సెస్ఫుల్ గా సాగింది. పవిత్రనాథ్ కి ఫేమ్ వచ్చింది. అలాగే చక్రవాకం సీరియల్ లో కూడా పవిత్రనాథ్ నటించాడు. ఇది కూడా మంచి ఆదరణ దక్కించుకుంది. పవిత్రనాథ్ మృతికి కారణాలు తెలియరాలేదు. దాంతో ఆయన అనారోగ్యంతో మృతి చెందారా? లేక వ్యక్తిగత కారణాలు ఏమైనా? ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.
కొన్నాళ్ల క్రితం పవిత్రనాథ్ పై భార్య శశిరేఖ సంచలన ఆరోపణలు చేసింది. అతనికి అమ్మాయిల పిచ్చి. జాతకాల పేరుతో ఇంటికే అమ్మాయిలను తీసుకొచ్చేవారు. తాగి నన్ను రోజూ కొడతాడు. పెళ్లయ్యాక కూడా 8 ఏళ్ళు వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు 10ఏళ్ళు నరకం చూశాను, అని శశిరేఖ తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది.
భార్య ఆరోపణల మీద పవిత్రనాథ్ స్పందించలేదు. కాగా కొన్నాళ్లుగా పవిత్రనాథ్ సీరియల్స్ లో కనిపించడం లేదు. ఆఫర్స్ రాకపోవడంతో పరిశ్రమకు దూరమయ్యాడని సమాచారం. మిత్రులను కూడా కలవడం లేదు. సోషల్ మీడియాలో సైతం అంతంత మాత్రమే. ఏది ఏమైనా యువ నటుడి మృతి బుల్లితెర పరిశ్రమను విషాదంలోకి నెట్టింది.