Homeఎంటర్టైన్మెంట్రోజా కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా?

రోజా కొత్త బిజినెస్.. ఏంటో తెలుసా?

RK Roja
రోజా.. ఒకప్పుడు బోల్డ్ హీరోయిన్.. ఇప్పుడు బోల్డ్ ఎమ్మెల్యే. రోజా అంటేనే డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. అన్నట్లు ప్రస్తుతం రోజా కొత్త బిజినెస్ లోకి దిగబోతుంది. కొత్త టీవీ షో నిర్మాణానికి రంగం సిద్ధం చేసుకుంది. ముఖ్యంగా యూత్ ను టార్గెట్ చేస్తూ.. డాన్స్ అండ్ కామెడీ మిక్స్ చేసి.. ఓ సరికొత్త షోను రెడీ చేశారట రోజా టీమ్. త్వరలోనే అనగా సంక్రాంతికి ఈ షో తాలూకు ప్రోమోను రిలీజ్ చేయనున్నారు. ఇక నగరి ఎమ్మెల్యేగా రోజా ఫుల్ బిజీగా ఉంది. అలాగే మూడు టీవీ షోలతో పాటు కొన్ని సినిమాల్లో కూడా నటించడానికి ప్లాన్ చేసుకుంది. ఇన్ని చేస్తూనే.. మళ్ళీ నిర్మాతగానూ మారబోతుంది.

Also Read: త్రివిక్రమ్‍ తో మహేష్ కి ఇక కష్టమే.. కారణం అదేనా ?

హీరోయిన్ గా, రాజకీయ నాయకురాలిగా రోజాకి ఫుల్ పాపులారిటీ ఉన్నా.. నిజానికి ‘జబర్దస్త్’ అనే ప్రోగ్రామ్ తోనే రోజాకి తెలుగు ప్రేక్షకుల్లో మంచి జడ్జ్ గా గుర్తింపు వచ్చింది. అయితే, ఆ గుర్తింపును క్యాష్ చేసుకోవడానికి రోజా శాయశక్తులా ప్రయత్నాలు మొదలుపెట్టింది. మా టీవీ కోసమే ఈ సరికొత్త షో ఒకటి ప్లాన్ చేస్తోందట. ఈ షోకి అనుసంధాన కర్తగా అలాగే నిర్మాతగా కూడా రోజా ఉండబోతోందని తెలుస్తోంది. మరి, ఈ షో సరిగ్గా వర్కౌట్ అయితే.. రోజా ఇటు నిర్మాతగానూ ఫుల్ బిజీ అవ్వడం ఖాయం.

Also Read: స్టార్ డమ్ కోసం ఎక్స్ పోజింగ్ ఏమిటి.. ఏమైనా చేస్తాను !

ఒకవేళ షో సక్సెస్ అవ్వకపోతే రోజా టీవీ కెరీర్ మీదే ఎఫెక్ట్ పడే అవకాశం కూడా ఉంది. షో నచ్చకపోతే తెలుగు ప్రేక్షకులు దాన్ని పక్కన పెట్టేయడం తెలుగు బుల్లితెరకు ఆనవాయితీగా వస్తోన్న ఆచారం. ఇక రోజాకి ఇంకా మంత్రిపదవి మీద ఆశ ఉన్నట్లు ఉంది. జగన్ మెప్పు కోసం రోజా ఇంకా ప్రయత్నాలు మొదలుపెడుతుందట. మొత్తానికి రోజా అన్ని రకాలుగా ముందుకుపోతుంది. మరి ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular