Balakrishna Comments On Chiranjeevi: చిరంజీవి(Megastar chiranjeevi), బాలయ్య(Nandamuri Balakrishna) పైకి బాగానే స్నేహం గా ఉన్నట్టు కనిపిస్తుంటారు కానీ, ఇద్దరి మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంది అనేది వాస్తవం. అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చిరంజీవి బాలయ్య పై ఇప్పటి వరకు నోరు జారలేదు కానీ, బాలయ్య మాత్రం చిరంజీవి పైన అనేకసార్లు నోరు జారాడు. నేడు అయితే ఆయన అసెంబ్లీ సాక్షిగా మరోసారి నోరు జారాడు. విషయం లోకి వెళ్తే నేడు జరిగిన అసెంబ్లీ సమావేశంలో కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ చిరంజీవి మరియు సినీ ఇండస్ట్రీ ప్రముఖులను అవమానించిన తీరుని గుర్తు చేస్తూ కొన్ని కామెంట్స్ చేసాడు. దీనికి బాలయ్య ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియా లో సంచలన టాపిక్ గా మారింది. మరోసారి మెగా వెర్సస్ నందమూరి ఫ్యాన్ వార్స్ క్రియేట్ అయ్యేలా చేసింది.
Also Read: ‘బిగ్ బాస్ 9’ లోకి అడుగుపెట్టిన మరో నలుగురు ‘అగ్నిపరీక్ష’ కంటెస్టెంట్స్..వైరల్ అవుతున్న వీడియో!
బాలయ్య ఏమన్నాడంటే ‘ఇందాక కామినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ, అప్పట్లో సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు జగన్ ని కలవడానికి వెళ్లి, చిరంజీవి గారు గట్టిగా అడిగితే మాజీ సీఎం దిగొచ్చాడు అనేది అబద్దం. గట్టిగ ఎవ్వరూ అడగలేదు, ఇలాంటి అసత్యాలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మిగతావన్నీ ఓకే, నిజంగానే మాజీ సీఎం అవమానించాడు. నన్ను కూడా ఆహ్వానించారు, నాది 9వ పేరు, అందుకే నేను వెళ్ళలేదు, నాన్ సెన్స్ మాట్లాడకండి’ అంటూ చాలా గట్టిగా రియాక్ట్ అయ్యాడు బాలయ్య బాబు. క్రింద మీరు వీడియో లో అది చూడొచ్చు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు సభ లో ఉన్నప్పుడు బాలయ్య ఇలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నయ్య గురించి మాట్లాడడం చిన్న విషయం కాదు. నేడు పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ కారణంగా సభకు రాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆయన బాలయ్య కి కౌంటర్ ఇచ్చేవాడేమో, ఆసక్తికరమైన సంఘటన చూడలేకపోయామే అని శాసనసభ ని చూసిన వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు.
అసెంబ్లీలో ఉన్న మన కులపు ఎమ్మెల్యేల చేత ఎలివేషన్లు ఏపించుకుందాం అనుకుని ep అయిపోయావు బాసూ @KChiruTweets pic.twitter.com/6detxpPINg
— Arjun Das #OG (@padmabhushanNBK) September 25, 2025