Mithra Mandali Movie Review: ఈమధ్య కాలం లో కొత్త రకం కాన్సెప్ట్స్ తో పాటు, అడల్ట్ కామెడీ ఉన్న సినిమాలు ఇండస్ట్రీ లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ అయితే ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు. మేకర్స్ కూడా ఎక్కువగా అలాంటి సబ్జక్ట్స్ పైనే ఫోకస్ పెడుతున్నారు. ఈ దీపావళి కి ఆ కోవకి చెందిన ‘మిత్రమండలి'(Mitra Mandali Movie) అనే చిత్రం మన ముందుకు రాబోతుంది. ఈ నెల 16వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. దానికి తోడు మూవీ టీం చేస్తున్న ప్రొమోషన్స్, ఆ చిత్ర నిర్మాత బన్నీ వాసు ఇచ్చే ఇంటర్వ్యూస్ తో పాటు, నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, ఈ సినిమా పై మార్కెట్ లో బజ్ క్రియేట్ అయ్యేలా చేసింది.
అయితే ఈ సినిమా ట్రైలర్ ని చూసిన తర్వాత మన అందరికీ గుర్తుకు వచ్చిన సినిమా ‘జాతి రత్నాలు’. అందులో కూడా ఇలాగే ముగ్గురు స్నేహితులు ఉంటారు, వాళ్ళు చేసే కోతి చేష్టలు, దాని వల్ల వచ్చే ఫన్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించేలా చేసింది. ఫలితంగా కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని అనుసరిస్తూ మ్యాడ్ సిరీస్ వచ్చి మంచి ఆదరణ దక్కించుకుంది. ఇప్పుడు అదే ట్రెండ్ ఫాలో అవుతూ ఈ మిత్రమండలి చిత్రం కూడా తెరకెక్కింది. రీసెంట్ గానే ప్రసాద్ ల్యాబ్స్ లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని కొంతమంది మీడియా ప్రముఖులతో కలిసి చూసిందట మూవీ టీం. వాళ్ళ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఒకసారి చూద్దాం. ట్రైలర్ లో ఏదైతే ఫన్ ఉందో, సినిమాలో కూడా అదే రేంజ్ ఫన్ ఉందనే టాక్ వినిపిస్తుంది.
ఫస్ట్ హాఫ్ మొత్తం హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉందని, అది బాగా వర్కౌట్ అయ్యిందని, సోషల్ మీడియా ని అనుసరించే ఆడియన్స్ తమ స్నేహితులతో కలిసి ఈ సినిమా ని చూస్తే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. సినిమాలో చాలా సన్నివేశాలు ఎక్కడో చూసామే అన్నట్టుగా అనిపించినప్పటికీ, అవి ఎంటర్టైన్ చేస్తుందని, ఇక సెకండ్ హాఫ్ అయితే మధ్యలో కొన్ని సన్నివేశాలు ల్యాగ్ అనిపించినా చివరి 30 నిమిషాలు వేరే లెవెల్ ఫన్ తో ఉంటుందని, చాలా కాలం తర్వాత ఆడియన్స్ కడుపుబ్బా నవ్వుకునే సినిమాగా ఈ చిత్రం నిలుస్తుందని అంటున్నారు. ప్రియదర్శి, రాగ్ మయూర్,విష్ణు వంటి వారు తమ అద్భుతమైన కామెడీ టైమింగ్ తో అలరించారని, అదే విధంగా నిహారిక కూడా అదరగొట్టిందని అంటున్నారు. ఇవి ఎంత మాత్రం నిజమో తెలియాలంటే ఎల్లుండి వరకు ఆగాల్సిందే.