Homeఎంటర్టైన్మెంట్Miss Shetty Mr Polishetty Twitter Talk: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్:...

Miss Shetty Mr Polishetty Twitter Talk: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ట్విట్టర్ టాక్: అనుష్కకు హిట్ పడిందా? ఆడియన్స్ తేల్చేశారు!

Miss Shetty Mr Polishetty Twitter Talk: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ఆచి తూచి సినిమాలు చేస్తున్నారు. చెప్పాలంటే ఆమె గ్లామర్ రోల్స్ వదిలేశారు. కమర్షియల్ సినిమాల్లో నటించే ఉద్దేశం లేదు. ఆమె బరువు పెరగడం కూడా ఇందుకు కారణం. అనుష్క గత చిత్రం నిశ్శబ్దం 2020లో విడుదల కాగా మూడేళ్లకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్ర హీరో నవీన్ పోలిశెట్టి. ఆయన గత చిత్రం జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్. వీరి కాంబోలో వచ్చిన రొమాంటిక్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.

ఇక మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి స్టార్స్ ప్రచారం కల్పించారు. అనుష్క తనకు ఇష్టమైన వంటల రెసిపీ సోషల్ మీడియాలో షేర్ చేసి… అలాగే ప్రభాస్ తన ఫేవరెట్ ఫుడ్ రెసిపీ చెప్పాలని ఛాలెంజ్ విసిరింది. అది స్వీకరించిన ప్రభాస్ మరో స్టార్ రామ్ చరణ్ ని నామినేట్ చేశాడు. ఆ విధంగా మూవీకి గట్టి ప్రచారం దక్కింది. దీంతో ఒకింత అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ఈ చిత్ర యూఎస్ ప్రీమియర్స్ ముగిశాయి. ట్విట్టర్ వేదికగా ఆడియన్స్ సినిమా ఎలా ఉందో కామెంట్స్ చేస్తున్నారు.

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డీసెంట్ టాక్ సొంతం చేసుకుంది. కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ ప్రధానంగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. స్టాండప్ కమెడియన్ గా నవీన్ పోలిశెట్టి కనిపించారు. సినిమాలో ఆయనే ప్రధాన ఆకర్షణ అంటున్నారు. తన హిలేరియస్ కామెడీ, ఎనర్జీతో నవీన్ ఆద్యంతం సినిమాను ఆకట్టుకునేలా నడిపించాడని అంటున్నారు. స్టాండప్ కమెడియన్ పాత్రలో ఆయన రోల్ సహజంగా ఉందంటున్నారు.

అనుష్క శెట్టి చాలా గ్యాప్ తర్వాత స్క్రీన్ పై కనిపించడం పట్ల ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చెఫ్ గా అనుష్క మెప్పించే ప్రయత్నం చేసింది. సెట్టిల్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకుందని ప్రేక్షకుల అభిప్రాయం. నవీన్, అనుష్క మధ్య రొమాంటిక్ సీన్స్, కామెడీ వర్క్ అవుట్ అయ్యింది. ఎమోషనల్ గా కొంత మేరకు కనెక్ట్ అయ్యిందంటున్నారు. అయితే సినిమా సాగదీతకు గురైంది. అక్కడక్కడా బోరింగ్ గా ఉంటుందని అంటున్నారు. సాంగ్స్, మ్యూజిక్ పర్లేదు అంటున్నారు. ఓవరాల్ గా డీసెంట్ మూవీ. ఒకసారి చూడొచ్చు అంటున్నారు.

https://twitter.com/KSrinuTweets/status/1699580913364210156

https://twitter.com/ReviewMamago/status/1699566384580358409

 

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
RELATED ARTICLES

Most Popular